Breaking News Live Updates: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Apr 2022 07:56 PM
తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

Group-I Notificatio : తెలంగాణలో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 503 పోస్టులకు టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసింది. 

Prashanth Kishor: కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన పీకే

కాంగ్రెస్‌ ఆఫర్ ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన అంగీకరించలేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ఏఐసీసీ  జనరల్ సెక్రటరీ సుర్జేవాలా 

Revanth Reddy Khammam Tour: రేవంత్ ప్రెస్‌మీట్ లో గందరగోళం, తోపులాటలో పగిలిన ఆఫీసు అద్దాలు

Revanth Reddy Khammam Tour: రేవంత్ ప్రెస్‌మీట్ లో గందరగోళం, తోపులాటలో పగిలిన ఆఫీసు అద్దాలు


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనలో గందరగోళం నెలకొంది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే కార్యకర్తలు ఒక్కసారిగా హాల్ లోకి రావడంతో తోపులాట జరిగింది. కార్యాలయం అద్దాలు పగిలాయి. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

LB Nagar TIMS Hospital: ఎల్బీ నగర్‌లో టిమ్స్ ఆస్పత్రికి శంకుస్థాపన

ఎల్బీన‌గ‌ర్ సమీపంలోని గ‌డ్డి అన్నారంలో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. 21.36 ఎక‌రాల్లో జీ + 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల ఆస్పత్రిగా నిర్మించ‌నున్నారు. 300 ఐసీయూ బెడ్స్, 16 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఉండేలా ఆస్ప‌త్రి నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.900 కోట్లు కేటాయించారు.

డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

6-12 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ కరోనా టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగం కింద ఈ అనుమతులు జారీ చేసింది. 

Nellore Court Theft Case: నెల్లూరు కోర్టు దొంగతనం కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ

నెల్లూరు కోర్టు దొంగతనం వ్యవహారంలో ప్రతివాదులందరికీ ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, సీబీఐ డైరెక్టర్, డీజీపీ, సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది. అయితే, ఈ కేసులో సీబీఐ విచారణ చేసేందుకు తమకు ఏమీ అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు.

Tirumala Updates: కేసీఆర్‌పై వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు

తిరుమలలో తెలంగాణ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారన్నారు.. తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి‌ భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసిఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆరే విమర్శించారని గుర్తు చేశారు.. ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారంటే కేసిఆర్ ఓటమి పాలు అవుతున్నట్లు ఒప్పుకుంటున్నారన్నారు. అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. తెలంగాణలో వరుస ఎన్నికలలో బీజేపీకే ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన తెలిపారు.

Vijayawada: విజయవాడలో రెస్టారెంట్ ఓనర్‌పై హత్యాయత్నం కలకలం

విజయవాడలోని ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నరేంద్ర, వర్కింగ్ పార్టనర్ వెంకటేశ్వరరావులపై హత్యాయత్నం జ‌రిగింది. హోటల్ నుండి ఇంటికి వెళుతున్న సమయంలో బైక్ పై ఫాలో అయిన అజ్ఞాత వ్యక్తులు, అశోక్ నగర్ సమీపంలోకి రాగానే బీర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డారు. దాడి నుండి న‌రేందర్ త్రుటిలో తప్పించుకున్నారు. అయితే, వెంకటేశ్వరరావు తలకి బలమైన గాయం అయ్యింది. పెనమలూరు పోలీస్టేషన్‌లో బాదితులు ఫిర్యాదు చేశారు. శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ యజమాని మనోహర్, అతని స్నేహితుడు వేగె వెంకటేశ్వరరావు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ ఆంజనేయ హోటల్ నిర్వహణలో నరేంద్రను రూ.15 కోట్లకు మ‌నోహ‌ర్ మోసం చేశార‌ని చెబుతున్నారు. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ పేరు తొలగించాలంటూ కొంతకాలంగా బెదిరింపులకు దిగుతున్నారు. ట్రేడ్ మార్క్ తో హోటల్ నడుపుకుంటున్న నరేంద్ర, మాట విన‌క‌పోవ‌టంతోనే హత్యాయత్నం జ‌రిగింద‌నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూలపల్లి మనోహర్, వేగే వెంకటేశ్వరరావులపై చర్యలు తీసుకోవాలని న‌రేంద్ర పోలీసులను కోరారు. పెనమలూరు పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Background

ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేడు వర్షాలు కురవనున్నాయి. మరో మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయిని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలపై ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురవనుండగా,  రాయలసీమలో, తెలంగాణలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఈ ప్రాంతాల్లో మూడో మూడు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు  విస్తరిస్తున్నాయి. రంపచోడవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. విశాఖ నగరంలో మాత్రం వర్షాలుండవు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. ప్రస్తుతానికి విశాఖ నగర శివారులు గాజువాక​, పెందుర్తి, అనకాపల్లి, సబ్బవరం, సింహాచలం, విజయనగరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు చోట్ల అక్కడక్కడ కొన్ని వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తునిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
మరో వైపున రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు భాగాల్లో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. అనంతపురం జిల్లా హిందుపురం, మడకశిర వైపు పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపున నంద్యాల జిల్లా ఆత్మకూరు, నందికొట్కూరుకు వర్ష సూచన ఉంది. విజయవాడ - చీరాల బెల్ట్ లో ఎండల తీవ్రత ఎక్కువైంది. కర్నూలు, తిరుపతి, నంద్యాలలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్టంగా అనంతపురం జిల్లాలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని, ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవనుండగా.. చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం, నల్గొండలో 41 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత.. హైదరాబాద్ లో 39.2 డిగ్రీలుగా నమోదైంది. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 41 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలు నమోదయ్యాయి. పడమర, నైరుతి దిశల నుంచి 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.