Anantapur Narayan student suicide: జూనియర్ కాలేజీ క్యాంపస్, క్లాస్ జరుగుతోంది. మూడో అంతస్తులో ఉన్న ఓ క్లాసులో సీరియస్ గా లెక్చరర్ పాఠాలు చెబుతున్నారు. ఆ సమయంలో ఓ విద్యార్థి ఎవరో పిలిచినట్లుగా హఠాత్తుగా లేచి బయటకు వెళ్లిపోయాడు . ఎందుకు వెళ్లాడో తెలియదు కానీ అలా వెళ్లి నేరుగా పిట్టగోడ ఎక్కి కిందకు దూకేశాడు. అలా చేస్తాడని ఎవరూ ఊహించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పరుగులు పెట్టి కిందకు వెళ్లారు కానీ పై నుంచి పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
క్లాస్ జరుగుతూండగానే దూకేసిన విద్యార్థి
నగర శివారులోని సోమలదొడ్డి వద్ద ఉన్న నారాయణ కళాశాలలో బత్తలపల్లి మండలం రామాపురంకి చెందిన చరణ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు అనంతరం కళాశాల వచ్చాడు. ఉదయం 10:30 సమయంలో కళాశాల మూడవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఎందుకు దూకాడో పక్కన ఉన్న వారికీ అర్థం కాలేదు.
ఇంత కఠిన కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరా?
తల్లిదండ్రులు కని పెంచడానికి ఎంతో కష్టపడతారు. అయితే ప్రాణాలు తీసుకునే విషయంలో ఇలా ఒక్క క్షణం కూడా ఆలోచించని మనస్థత్వం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మరో వైపు విద్యార్థి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమ ేకారణం అని.. విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తపు మరకలు తుడిచివేసి ఈ సంఘటన ఎందుకు బయటకు రానికుండా చేశారని ప్రశ్నించారు. ఫీజుల వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని... దీనిపై సమగ్ర విద్య దర్యాప్తు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.