US C Section requests surge as birthright citizenship deadline looms: పుట్టకతో వచ్చే పౌరసత్వం విషయంలో ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న అనేక దేశాల జంటలకు కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ తో ఉన్న వారు.. ట్రంప్ ఆదేశాల ప్రకారం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కదని భావిస్తున్నవారు.. ఫిబ్రవరి ఇరవయ్యేతేదీలోపు తమ బిడ్డను భూమిపై పడేలా చేసుకుని అమెరికా పౌరసత్వం దక్కేలా చేసుకోవాలనుకుంటున్నారు. ఇందులో ఇండియన్స్ కూడా ఎక్కువగానే ఉంటున్నారు.  


ఆరేడు నెలల్లోనే సిజేరియన్ చేయాలని ఆస్పత్రులకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు           


పలు ఆస్పత్రుల్లో ముందస్తుగా తమకు సిజేరియన్ చేయాలని అభ్యర్థులు అంతకంటే ఎక్కువగా వస్తున్నాయి.   అ ఈ అభ్యర్థనలలో ఎక్కువ  గర్భం దాల్చిన ఎనిమిదవ లేదా తొమ్మిదవ నెలలోని భారతీయ మహిళల నుండి వస్తున్నట్లుగా అమెరికన్ మీడియా చెబుతోంది. వారిలో చాలామంది ఫిబ్రవరి 20కి ముందు సి-సెక్షన్ల కోసం అడుగుతున్నారు. గర్భం ఏడో నెల ఉన్నప్పటికీ సిజేరియన్ చేయాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది.          


అమెరికా పౌరులు కాని వారికి పుట్టే బిడ్డలకు ఇక పౌరసత్వం ఇవ్వరు !                     


అమెరికా పౌరులు కాని వారికి జన్మించే పిల్లలకు సహజంగా వచ్చే పౌరసత్వం రద్దు చేశారు. అమెరికాలో జన్మించిన వలసదారుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఆర్డర్ 30 రోజుల తర్వాతి నుంచి అమల్లోకి రానుంది. అటువంటి పిల్లలకు సామాజిక భద్రతా కార్డులు, పాస్‌పోర్ట్‌లు వంటి పౌరసత్వ పత్రాల జారీని నిలిపివేయాలని ట్రంప్ ఉత్తర్వుల్లో ఉంది. భారత్ నుంచి అత్యధికంగా చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారు ఎవరికీ శాశ్వత పౌరసత్వం ఉండదు. హెచ్ వన్ బీ సహా వివిధ వీసాల మీద వారు అమెరికాకు ఉద్యోగాలు చేసేందుకు వెళ్తారు. చాలా మంది వివిధ రకాల వీసాలతో అక్కడే ఉంటున్నారు. కొంత మంది సరైన పత్రాలు లేకపోయినా ఉంటున్నారు.             


ట్రంప్ ఆర్డర్ చెల్లదని నిపుణుల అభిప్రాయం - అయినా రిస్క్ తీసుకోకూడదనుకుంటున్న ప్రెగ్నెంట్ మహిళలు 


ఇప్పటి వరకూ వీరందరికీ అక్కడ పుట్టే పిల్లలకు చట్ట పరంగా పౌరసత్వం వస్తుంది. తమ తల్లిదండ్రులు అమెరికన్లు కాకపోయినా తమ బిడ్డలు మాత్రం అమెరికన్లు అవుతారు. ఇలాంటి అవకాశం ట్రంప్ ముగించేయడంతో వీలైనంత వరకూ ఫిబ్రవరి ఇరవై లోపు పిల్లల్ని కనాలని అనుకుంటున్నారు. అయితే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందున చెల్లదని లా సూట్స్ దాఖలయ్యాయి. అయినా కొంత మంది ఆందోళనతో సిజేరియన్ల కోసం  పరుగులు పెడుతున్నారు. 



Also Read : Kalki 2898 AD Part 2: 'కల్కి 2868 ఏడీ పార్ట్ 2' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత... ఒకేసారి ప్రభాస్ 3 సినిమాలు సెట్స్ మీదకు?