Low Pressure Prevail Over Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. వాయుగుండం నేడు అసని తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.  


దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయుగుండం అసని తుఫాన్‌గా మారింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కదిలి పోర్ట్ బ్లెయిర్‌కు 170 కి.మీ దక్షిణంగా, నికోబార్ దీవులకు 110 కి.మీ వాయువ్యంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం, అమరావతి కేంద్రం తెలిపాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం తుఫాన్‌గా బలపడింది. 


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అసని తుఫాన్ నేపథ్యంలో మరోవైపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని వాతావరశాఖ హెచ్చరించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గత రెండు వారాలుగా పెరుగుతున్న ఎండల నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. గత మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. . 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
అసని తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  రాయలసీమలో చలి గాలులు వేగంగా వేచనున్నాయి.  చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.






తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Temperature in Andhra Pradesh)
తెలంగాణలో హైదరాబాద్ సహా కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. దీంతో నగరవాసులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 కిందకి దిగొచ్చింది. అయినా పగటి పూట వేడ అధికంగా ఉంటుంటే, సాయంత్రానికి చిరుజల్లులు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయి. భగభగ మండే రామగుండంలో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పడిపోయింది.
Also Read: Cyclone Asani: దూసుకొస్తున్న అసని తుఫాన్ ముప్పు- బలమైన గాలులతో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు


Also Read: Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్! 104 కొత్త రైళ్లు, ఈ నగరాల మధ్యే