రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ మార్చి 22వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ వీబోలో ప్రకటించింది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ టీజర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది. దీంతోపాటు రియల్ మీ జీటీ నియో 3 లే మాన్స్ ఎడిషన్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇది ఒక స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్.


అధికారిక రెండర్ల ప్రకారం... రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. కెమెరా పక్కనే తెల్ల రంగులో రెండు స్ట్రిప్స్‌ను కూడా చూడవచ్చు. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, సిమ్ స్లాట్లను ఫోన్ కింద భాగంలో అందించారు. ఫోన్ ఎడమవైపు వాల్యూమ్ బటన్లు, కుడివైపు పవర్ బటన్ ఉండనుంది.


ఈ ఫోన్ 150W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుందని రియల్‌మీ ఇప్పటికే ప్రకటించింది. కేవలం 15 నిమిషాల్లోనే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.


రియల్‌మీ జీటీ నియో 3 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 కెమెరా ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?