South Central Railway: ఈ ఎండాకాలం ప్రయాణికుల రద్దీని అంచనా వేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తు్న్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే సంస్థ ప్రకటించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 104 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లుగా దక్షిణమధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. సికింద్రాబాద్ - ఎర్నాకులం - సికింద్రాబాద్ మధ్య 26 ప్రత్యేక రైళ్లు, మచిలీపట్నం - కర్నూల్ సిటీ - మచిలీపట్నం మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లుగా రైల్వే ట్వీట్ చేసింది.
సికింద్రాబాద్ - ఎర్నాకులం మధ్య
సికింద్రాబాద్ - ఎర్నాకులం ప్రత్యేక రైలు నెంబర్ 07189 ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9.05గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 8.15 గంటలకు ఎర్నాకులం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకులం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నెంబర్ 07190. ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి శనివారం రాత్రి 11.25 గంటలకు ఎర్నాకులం నుంచి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్పెట్టాయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాల్గాట్, త్రిస్సూర్, ఆలువ స్టేషన్లలో ఆగుతుంది.
మచిలీపట్నం- కర్నూలు సిటీల మధ్య
మచిలీపట్నం- కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైలు నెంబరు 07067. ఏప్రిల్‌లో 2, 5, 7, 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో.. మేలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్‌లో 2, 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23,25, 28, 30 తేదీల్లో ఈ సర్వీసు నడవనుంది. ప్రతి మంగళ, గురువారం, శనివారం ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 3.50 సమయంలో గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు 5.10 గంటలకు కర్నూలు చేరుతుందని వివరించారు.
కర్నూలు సిటీ-మచిలీపట్నం మధ్య నడిచే ప్రత్యేక రైలు నెంబరు 07068. ఇది ఏప్రిల్‌లో 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో, మేలో 1, 4, 6, 8, 11, 13,15, 18, 20,22, 25, 27, 29 తేదీల్లో, జూన్‌లో 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29, జూలై 1వ తేదీన నడుస్తుంది. రాత్రి 20.00 గంటలకు కర్నూలులో బయలుదేరి మరుసటి రోజు 7.15 గంటలకు మచిలీపట్నం చేరుతుంది. ఈ రైలు ప్రతి బుధవారం, ఆదివారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది.