ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటికే రోజు వారీ కేసులు 10 వేలు దాటాయి. ఏపీలో మరో మంత్రి కోవిడ్ బారినపడ్డారు. ఇటీవల మంత్రి కొడాలి నానికి కోవిడ్ సోకింది. ఆయన కోవిడ్‌ బారినపడి కోలుకున్నారు. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. తాను హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్‌లో కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 


Also Read: నెల్లూరు జిల్లాలో ఘాతుకం... సహజీవనంలో గొడవలు ఇద్దరి దారుణ హత్య






ఏపీలో కరోనా కేసులు


కరోనా వైరస్ కేసులు ఏపీలో రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా.. 43,763 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 12,926 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారి నుంచి..మరో 3,913 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. 73 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో సంక్రాంతి అనంతరం కోవిడ్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. రోజు వారీ కేసులు సంఖ్య 10 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. కోవిడ్ దృష్ట్యా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాష్ట్రంలో ఆంక్షలు విధించిది. జనవరి 31 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కోవిడ్ నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించని వారికి రూ.100 ఫైన్ వేయాలని సూచించింది. 






Also Read: రాజద్రోహమే కాదు.. ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించాడని కేసులు.. సాక్ష్యాల్లేవని బెయిలిచ్చిన కోర్టు !