'I Said Yes' అంటూ రీసెంట్ గా సురేఖా వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ పోస్ట్ చేసినప్పుడే జనాలకు ఇదేదో ప్రమోషన్ కోసం చేసిన పోస్ట్ లా ఉందంటూ అనుమానాలు వచ్చాయి. కానీ సుప్రిత మాత్రం జనాలను ఫూల్స్ చేయడానికి 'ఐ సెడ్ ఎస్' అంటూ రాసుకొచ్చింది. ఈ రకమైన ప్రమోషన్స్ ఇదివరకు చాలా మంది చేసేసారు. అందుకే సుప్రిత పోస్ట్ పెట్టినప్పుడు కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. 


కానీ సురేఖా వాణి కూతురు ప్రేమలో పడిందని.. తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిందంటూ కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆ విధంగా అందరి అటెన్షన్ తనవైపు పడుతుందని సుప్రిత ఆలోచించి ఉంటుంది. కానీ అందరికీ ఇది ప్రమోషన్ స్ట్రాటజీ అని ముందే అర్ధమైంది. 


ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతూ.. సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టింది సుప్రిత. తను ఎస్ దేనికి చెప్పిందో వెల్లడించింది ఈ బ్యూటీ. 'వెళ్లిపో' అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది సుప్రిత. ఇందులో నటించడానికే తను ఎస్ చెప్పినట్లు పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తే జనాలు ట్రోల్ చేస్తారని అనుకుందో ఏమో.. కామెంట్ సెక్షన్ డిజబుల్ చేసింది. ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తోన్న సుప్రిత వెండితెరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి. 






Also Read: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..


Also Read: చై-సామ్ విడాకులు.. ఆ చెత్త వార్తలు బాధపెట్టాయంటున్న నాగ్..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి