AP High Court Summer Holidays: ఏపీలో నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 9వ తేదీ నుంచి జూన్‌ 10 వరకు వేసవి సెలవులు కాగా, తిరిగి జూన్‌ 13వ తేదీ నుంచి హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు. 


వెకేషన్ కోర్టులు ఏర్పాటు.. 
వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. హైకోర్టుకు వేసవి సెలవుల (Summer Holidays For AP High Court) నేపథ్యంలో మొదటి దశ వెకేషన్‌ కోర్టులు మే 12, 19, 26వ తేదీల్లో విచారణ చేపట్టనున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్‌ కె.మన్మథరావు, జస్టిస్‌ చీమలపాటి రవి, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు  సింగిల్‌ జడ్జిగా అత్యవసర కేసుల విచారణ జరుపుతారు. రెండో దశ వెకేషన్‌‌లో జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కేసుల విచారణ చేపడతారు. జూన్‌ 2, 9వ తేదీల్లో రెండో దశ వెకేషన్ కేసుల విచారణ విచారణ నిర్వహిస్తారు.  






అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేయాలి 
వేసవి సెలవులు పూర్తయ్యే వరకు వేచిచూసే వీలులేని అత్యవసర వ్యాజ్యాలు, హెబియస్ కార్పస్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ పిటిషన్లు మాత్రమే ఈ వెకేషన్ కోర్టుల్లో దాఖలు చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మొదటి దశ వెకేషన్, రెండో దశ వెకేషన్ కోర్టుల ఏర్పాటుతో పాటు తేదీలను సైతం ప్రకటించారు. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వ్యాజ్యాలు వేయాలనుకునేవారు, హైకోర్టుకు వేసవి సెలవుల విషయాన్ని, వెకేషన్ కోర్టుల వివరాలు గమనించాలని రిజిస్ట్రార్ సూచించారు.


Also Read: CPI Rama Krishna: అర్ధరాత్రి రోడ్డుపైనే పడుకున్న సీపీఐ రామకృష్ణ, పోరు గర్జనకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు - అసని తుపాను ప్రభావంతో 3 రోజులు వర్షాలు, వారికి వార్నింగ్