మే 8 సోమవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 09- 05 - 2022
వారం: సోమవారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం


తిథి  :  అష్టమి సోమవారం మధ్యాహ్నం 2.01 వరకు తదుపరి నవమి
వారం : సోమవారం     
నక్షత్రం:  ఆశ్లేష మధ్యాహ్నం 1.13 తదుపరి మఖ 
వర్జ్యం :  రాత్రి 2.02 నుంచి 3.44  
దుర్ముహూర్తం :  మధ్యాహ్నం 12.22 నుంచి 1.13 తిరిగి మధ్యాహ్నం 2.55 నుంచి 3.46
అమృతఘడియలు :  ఉదయం 11.29 నుంచి 1.12
సూర్యోదయం: 05:34
సూర్యాస్తమయం : 06:18


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


ఎంత పురాతనమో... అంత సనాతనం... ఎంత పవిత్రమో... అంత మహిమాన్వితం... ఆదిశంకరులు అద్వైతానికి అర్థం చెప్పిందిక్కడే... పాండవులు పాప పంకిలాలను తొలగించుకుందిక్కడే... అందరూ అన్నిచోట్లా జీవించాలని ప్రయత్నిస్తారు... ఇక్కడ మాత్రం జీవన్ముక్తి పొందాలని తపిస్తారు.. ఇది ముక్తి స్థలి.. సాక్షాత్‌ పరమశివుడు కొలువైన దివ్యస్థలి..భక్తయోగ పదన్యాసి... వారణాసి. అందుకే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలని భావిస్తారు.  సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు... ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుడి అష్టకం


విశ్వనాథ అష్టకం (Viswanatha Ashtakam)


గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మాదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్


వాచామగోచర మనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠమ్
వామేన విగ్రహావ రేణ్యకళత్రవంతం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్


భూతాధిపం భుజగ భూషణ భూశితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రిణే
త్రమ్పాశాంకుశభయవరప్రద శూలపాణిం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్


సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానలవిశోశితపంచబాణమ్
నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్


పంచాననం దురితమ త్తమతంగ జానాం నాగాంతకం దనుజపుంగవగానామ్
దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్


తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయ మానందకంద మపరాజిత మప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్


ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్క మలమధ్యగతం ప్రవేశం వారాణసీపురపతీం భజ విశ్వనాథమ్ 


రాగాదిరోషరహితస్వజనామ రాగం వైరాగ్య శాంతినిలయం గిరిజాసహాయం
మాధుర్యధైర్యసుభగం గరళాభీరామమ వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్


వారాణసీపురపతేః స్తవనం శివస్యవ్యాసోక్త మష్టక మిదం పఠితే మనుష్యః
విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్


విశ్వనాథాష్టక మిదం యః పఠేచ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే