మోటొరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రపంచంలోనే సన్నని ఫోన్ అంటూ కంపెనీ ప్రచారం చేస్తుంది. ఇందులో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్ ఇందులో ఉండనుంది.


మోటొరోలా ఎడ్జ్ 30 ధర (అంచనా)
ఈ ఫోన్ యూరోప్‌లో లాంచ్ అయినప్పుడు కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 449.99 యూరోలుగా (సుమారు రూ.36,300) నిర్ణయించారు. మనదేశంలో కూడా దీని ధర ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. అరోరా గ్రీన్, మీటియోర్ గ్రే, సూపర్ మూన్ సిల్వర్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


మోటొరోలా ఎడ్జ్ 30 స్పెసిఫికేషన్లు
యూరోప్ వేరియంట్లో ఉన్న ఫీచర్లే ఇందులో కూడా మోటొరోలా అందించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిన మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై మోటొరోలా ఎడ్జ్ 30 పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉండనుంది. డీసీఐ పీ3 కలర్ స్పేస్ కూడా ఇందులో మోటొరోలా అందించనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌‌ను ఉండనున్నాయి. ఈ ఫోన్ మందం కేవలం 0.67 సెంటీమీటర్లే కాగా... బరువు 155 గ్రాములుగా ఉండనుంది.


ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4020 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నారు.