ఆంధ్రప్రదేశ్‌లోని ( Andhra Pradesh ) 11 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు బ్యాడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం ( AP Governament ) విద్యా దీవెన పథకం కింద నిధులు మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది.  ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం విద్యాదీవెన ( Vidya Deevena ) కింద గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం చివరి క్షణంలో ప్రకటించింది.  సీఎం జగన్ ( CM Jagan ) మహిళా దినోత్సవంలో పాల్గొంటున్న కారణంగా బిజీగా ఉన్నారని అందు వల్ల పథకాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. 


"న్యాయవ్యవస్థ పరిమితులపై చర్చ" ఇప్పటికి లేనట్లే ! ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసిందా ?


ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజులు ( Fees ) చెల్లిస్తున్నారు.  11.03 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నారు. మొత్తం నాలుగు విడుతలుగా ఇవ్వాలని నిర్ణయించారు. 2021 ఏప్రిల్‌ 19న మొదటి విడత.. జూలై​ 29న   రెండో విడత , నవంబర్ 30వ తేదీన మూడో విడత ఫీజు తల్లుల ఖాతాల్లో జమ చేశారు. మార్చి ఎనిమిదో తేదీన నాలుగో విడత చెల్లించాలనుకున్నారు. కానీ సీఎం మహిళా దినోత్సవంలో పాల్గొనడం వల్ల వాయిదా పడింది.   


"పార్టీ" ఉద్దేశం లేకపోతే "రాజకీయ భేటీలు" ఎందుకు ? బ్రదర్ అనిల్ పార్టీ ఖాయమేనా ?


సాధారణంగా విద్యా దీవెన నిధులు ( vidya deevana )  కాలేజీలకు జమ చేయాలి. కానీ ప్రభుత్వం విధానం మార్చుకుని తల్లలకు జమ చేయడం ప్రారంభించింది. వారు తీసుకెళ్లి కాలేజీలకు కట్టాలి. అర్హులైన విద్యార్థులందరికీ కూడా వందకు వంద శాతం పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నారు.  కాలేజీలకు పిల్లల తల్లులే వెళ్లి కాలేజీల పరిస్థితులను, వసతులను చూసి.. కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతలను తల్లిదండ్రులకే అప్పగిస్తున్నాం. లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను వాళ్లు ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వ భావన.  


మహిళలకు 51 శాతం పదవులు ఒక్క ఏపీలోనే చట్టం - మహిళా దినోత్సవ వేడుకలో సీఎం జగన్


అయితే ఈ ఫీజుల అంశంపై హైకోర్టులో  ( High Court ) కేసులు కూడా వేశారు.  ఫీజు రీఎంబర్స్ మెంట్ ను నేరుగా కాలేజీలకు చెల్లించాలని యాజమాన్యాలు పిటిషన్లు వేశాయి. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయడం వల్ల వారు చెల్లించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.