అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు... తమిళ, హిందీ పరిశ్రమల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య వ్యవహారం మరింత చర్చకు కారణం అయ్యింది. కొన్ని రోజుల వ్యవధిలో సంగీత దర్శకుడు డి. ఇమాన్, మోనికా సైతం విడాకులు తీసుకున్నారు. హిందీ పరిశ్రమలోనూ విడాకులు తీసుకున్న జంటలు ఉన్నాయి. అయితే... తమిళనాడులో సెలబ్రిటీల విడాకులు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా తమిళ పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకుంది.


దర్శకుడు బాలా విడాకులు తీసుకున్నారు. 17 ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత ముత్తు మలర్ తో వేరు పడ్డారు. వాళ్ళిద్దరికీ ఓ కుమార్తె ఉన్నారు. చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో బాలా, ముత్తు మలర్ పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేశారు. గత వారం వాళ్ళిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కొంత ఆలస్యంగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది.


Also Read: నోరు తెరిచి అడిగిన బోయపాటి శ్రీను, సూర్య మనసులో ఏముందో?


సూర్య, విక్రమ్ హీరోలుగా బాలా దర్శకత్వం వహించిన 'శివపుత్రుడు' (తమిళంలో 'పితామగన్') సంచలన విజయం సాధించింది. అంతకు ముందు విక్రమ్ హీరోగా ఆయన తమిళంలో 'సేతు' సినిమా చేశారు. తెలుగులో దానిని 'శేషు'గా రాజశేఖర్ రీమేక్ చేశారు. బాలా తీసిన 'నేనే దేవుడిని' కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సూర్య హీరోగా ఆయన ఓ సినిమా చేస్తున్నారు. 


Also Read: 'రాధే శ్యామ్' నుంచి 'రౌడీ బాయ్స్' వరకూ... ఈ వారం థియేటర్ / ఓటీటీ వేడుకలలో విడుదల కాబోయే సినిమాల వివరాలు...