ఆలియా భట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పుడీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హాలీవుడ్‌లో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అవును... త్వరలో ఆలియా భట్ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించే సినిమాలో నటించేందుకు ఆమె సంతకం చేశారు. ఆ సినిమా ఏది? వివరాలు ఏమిటి? అంటే...


'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడట్, జమీ డోర్నన్ ప్రధాన తారలుగా నెట్‌ఫ్లిక్స్‌ ఇంటర్నేషనల్ ఓ సినిమా నిర్మిస్తోంది. వాళ్ళిద్దరితో పాటు ఆలియా భట్ కూడా నటిస్తున్నట్టు నేడు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఈ సినిమా పేరు 'హార్ట్ ఆఫ్ స్టోన్'. దీనికి టామ్ హార్పర్ దర్శకుడు. ఈ న్యూస్ ఆలియా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.


Also Read: బాయ్‌ఫ్రెండ్‌లో బెస్ట్ క్వాలిటీస్ - ఎన్టీఆర్‌ కామెంట్‌పై ఆలియా రియాక్షన్!


హాలీవుడ్ సినిమాల చేయాలని ఆలియా భట్ గత ఏడాది నిర్ణయించుకున్నారు. అమెరికాలో ఒక టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఓ సినిమాకు సంతకం చేశారు. హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన ఆలియా భట్, ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాలో కూడా కథానాయికగా ఖరారు అయినట్టే. ఆ సినిమా డిస్కషన్స్ జరుగుతున్నాయని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. 
Also Read: కారులో ఆలియా భట్ ఏం చేసిందో ఎన్టీఆర్ చెప్పబోతే...  






బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి ఇందులో కీలకపాత్రల్లో నటించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గంగూబాయి కుమారుడు, ఆమె మనవరాలు ఇప్పటికే ఈ సినిమాపై కోర్టులో కేసు పెట్టారు. తన తల్లి సెక్స్ వర్కర్ కాదని.. స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసిన ఆమెని తప్పుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సినిమా తీయడానికి తమ పర్మిషన్ కూడా తీసుకోలేదని వాపోయారు. ఈ సినిమాపై స్టే ఇవ్వమని అతడు కోరగా.. కోర్టు అతడి పిటిషన్ ని కొట్టిపారేయడంతో సినిమా విడుదలైంది.