AP Schools Late : ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల ప్రారంభ తేదీ ఒక రోజు వాయిదా పడింది. జూలై నాలుగో తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించారని ఇంతకు ముందు నిర్ణయించారు. అయితే ఆ రోజున ఏపీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నందున ఒక రోజు తర్వాత స్కూళ్లు ప్రారంంభించాలని నిర్ణయించారు. అంటే జూలై ఐదో తేదీ నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభమవుతాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలంగాణలోనూ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని జూలైలో ప్రారంభించాలని నిర్ణయించుకుంది. 


ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది, ముగిసిన ప్రచార పర్వం


జూలై నాలుగో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ  భీమవరంలో పర్యటిస్తారు. అజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించునున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.  ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  


టాలీవుడ్ లో సమ్మె సైరన్, రేపటి నుంచి షూటింగ్ లు బంద్!


12 మార్చి 2021 నుంచి 2022 ఆగస్టు 15 వరకు మొత్తం 75 వారాల పాటు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ ప్రత్యేక సంబరాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాల్లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.  ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకూ ఈ ఉత్సవాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో  స్కూళ్ల ప్రారంభం వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 


: ఆమంచికి సీబీఐ నోటీసులు - బుధవారం రావాలని ఆదేశం ! ఏ కేసులో అంటే ?


మామూలుగా అయితే ప్రధాని పర్యటనకు వస్తే స్కూళ్లకు సెలవులు ఇవ్వడం అనేది ఉండదు. స్కూళ్లకు.. ప్రధాని పర్యటనకు ఉపాధ్యాయులకూ సంబంధం ఉండదు. ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. అయినా ప్రధాని వస్తున్నందున స్కూళ్ల పునం ప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేయడాన్ని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికే ఒక నెల ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.