AP TS Postal GDS 2022 Results : భారత తపాలా శాఖకు చెందిన పోస్టల్ విభాగంలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. పదో తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల పోస్టల్ సర్కిల్స్ కు చెందిన ఫలితాలను సోమవారం పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఏపీలో 1716, తెలంగాణలో 1226 ఖాళీలకు భర్తీ చేసేందుకు గతంతో నోటిఫికేషన్ ఇచ్చింది పోస్టల్ శాఖ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం https://indiapostgdsonline.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు జులై 5న డివిజనల్‌ హెడ్‌ పోస్టు ఆఫీసుల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. 


జూలై 5 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 


దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ పోస్టాఫీసుల్లో మొత్తం 38,926 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌, డాక్‌ సేవక్‌ విధులు నిర్వహిస్తారు. ఏపీ పోస్టల్ సర్కిల్ గతంలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. అర్హత ఉన్న అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీల ప్రకారం పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలను విడుదల అయ్యాయి. ఏపీ పోస్టల్ GDS ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అధికారిక పోర్టల్ లో ఏపీ గ్రామీణ డాక్ సేవకుల మెరిట్ జాబితా పీడీఎఫ్ డౌన్‌లోడ్ ఉంచారు. ఎంపికైన అభ్యర్థులు పేర్లను ఈ జాబితాలో ఉంచారు. ఏపీలో మొత్తం 1716 పోస్టులు ఫలితాలు వెలువడ్డాయి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం స్థానిక హెచ్ పోస్ట్ ఆఫీసులకు 5 జూలై 2022 లోపు హాజరవ్వాలి. 


తెలంగాణలో 1226 పోస్టులు 


తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫలితాలను జూన్ 20న ప్రకటించింది తపాలాశాఖ. తెలంగాణ GDS ఫలితాలు అభ్యర్థుల మెరిట్ జాబితా ఆధారంగా రూపొందించారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌కు హాజరు కావాలి. తెలంగాణ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్లో 1226 ఖాళీలు ఉన్నాయి. వీటి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.indiapost.gov.in/లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 


ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 



  • ముందుగా అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్‌ చేయండి. 

  • హోమ్‌ పేజ్‌లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న Shortlisted Candidates లింక్‌ పై క్లిక్‌ చేయండి 

  • తర్వాత రాష్ట్ర సర్కిల్ ఎంపిక చేసుకోవాలి

  • ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫలితాల పీడీఎఫ్‌ డౌన్ లోడ్ చేసుకోండి

  • ఈ పీడీఎఫ్ లో ఫలితాలు చెక్ చేసుకోండి