Aamanchi CBI :    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 (ఏ) సెక్షన్ కింద అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమంచి కృష్ణమోహన్ ను గతంలోనూ సీబీఐ విచారంచింది. గతంలో డాక్టర్ సుధాకర్ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టు న్యాయమూర్తులపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఏపీ సీఐడీ పెద్దగా పట్టించుకోకపోవడంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 


టీచర్ జాబ్ సాధించిన వైసీపీ ఎమ్మెల్యే, 23 ఏళ్ల తర్వాత ఉద్యోగం!


దాదాపుగా న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంద మందికిపైగా నోటీసులు జారీ చేశారు.  హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత ఏడాది నవంబర్‌ నెలలో కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకూ కొంత మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఈ కేసులో ముందడుగు పడటం లేదు. ఇది వ్యవస్థీకృత నేరం అని సీబీఐ చెబుతోంది కానీ.. నిందితుల్ని మాత్రం పట్టుకోలేకపోతోంది. కేసులు నమోదైన తర్వాత కూడా దారుణమైన వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ అనే అమెరికాలో ఉండే ఎన్నారై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించినా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశామని సీబీఐ చెబుతూ వస్తోంది. 


పోటీ లేని ఆత్మకూరులోనూ సర్వశక్తులు ఒడ్డుతున్న వైఎస్ఆర్‌సీపీ ! మెజార్టీ కోసమేనా ?


ఈ క్రమంలో గతంలో ఆమంచిని విచారించిన సీబీఐ చాలా రోజుల తర్వాత మరోసారి అదే కేసులో విచారణకు పిలవడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.  ఠాత్తుగా ఆమంచికి నోటీసులు జారీ చేయడం  ఒక్క రోజులోనే హాజరు కావాలని ఆదేశించడం  హాట్ టాపిక్‌గా మారింది.  పదవిలో ఉన్న పలువురిని కూడా సీబీఐ ప్రశ్నిస్తుందని అంచనా వేస్తున్నారు. 


తనకుతానే చెప్పుతో కొట్టుకున్న వలంటీర్, అందరిముందే షాకింగ్ ఘటన


అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలపై కూడా గతంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వారి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను సీబీఐ అడిగినప్పుడు అందించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వివరాలను పరిశీలించి… తీవ్ర నేరాలకు పాల్పడినట్లు తేలితే సీబీఐ మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, వాటిపై దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని ఆదేశించింది. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న కేసులో ఆమంచిని  సీబీఐ ప్రశ్నిస్తూండటంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.