Ganesh Acharya On Board for Ginna: విష్ణు మంచు తగ్గేదే లే - 'జిన్నా'కు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్

Vishnu Manchu Ginna Movie Latest Update: 'జిన్నా' సినిమా సాంగ్స్ విషయంలో విష్ణు మంచు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్‌ను తీసుకుంటున్నారు.

Continues below advertisement

విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'జిన్నా' (Ginna Movie). తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అందుకని, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్‌ను సెలెక్ట్ చేస్తున్నట్టు ఉన్నారు. నృత్య దర్శకుల విషయం విష్ణు మంచు ఏమాత్రం తగ్గడం లేదు. 
 
'జిన్నా'లో ఒక పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఆయనకు హిందీలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. మరో పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. 'ఆర్ఆర్ఆర్'లో ప్రేమ్ రక్షిత్ చేసిన 'నాటు... నాటు...' సాంగ్ ఉత్తరాదిలోనూ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరో పాటకు గణేష్ ఆచార్య చేత కొరియోగ్రఫీ చేయిస్తున్నారు.

Continues below advertisement

'జిన్నా'లో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌, రేణుకగా సన్నీ లియోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరితో పాటు విష్ణు మంచు మీద తెరకెక్కించిన పార్టీ సాంగ్‌కు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. నిశ్చితార్థం నేపథ్యంలో ఈ పాట ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో గణేష్ ఆచార్య కూడా ఒక స్టెప్ వేశారు. 'పుష్ప: ది రైజ్'లో 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' పాటతో పాటు మరో పాటను ఆయన చేశారు.

Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. 

Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా

Continues below advertisement
Sponsored Links by Taboola