అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సమంత విడాకులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. వాళ్ళిద్దరూ విడిపోతారని ఎవరూ ఊహించలేదు. జరిగింది ఏదో జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ షూటింగులతో బిజీ అయ్యారు. అయితే, విడాకుల తర్వాత సమంత మీద చాలా పుకార్లు వచ్చాయి. విడాకులకు ఆమె కారణం అని కొంతమంది నిందించారు. ఒకానొక సందర్భంలో ఆమె స్పందించక తప్పలేదు. అదంతా గతం! ఇప్పుడు మరోసారి సమంతను టార్గెట్ చేస్తూ అక్కినేని అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? అని అసలు వివరాల్లోకి వెళితే...


Samantha Fires On Media Portal: 'గూఢచారి', 'మేజర్' సినిమాల్లో నటించిన శోభితా ధూళిపాళతో అక్కినేని నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారని కొత్తగా ఒక ప్రచారం మొదలైంది. దీనికి సమంత కారణం అనేది కొందరు చెప్పే మాట. సమంత పీఆర్ టీమ్ కావాలని నాగచైతన్య మీద పుకార్లు పుట్టిస్తున్నారని అక్కినేని అభిమానులు ఫీల్ అవుతున్నట్టు ఒక మీడియా పోర్టల్ న్యూస్ రాసింది. దానిపై సమంత ఫైర్ అయ్యారు.


''ఒక అమ్మాయి మీద పుకార్లు వస్తే... బహుశా నిజమే కావచ్చు.
ఒక అబ్బాయి మీద పుకార్లు వస్తే... ఒక అమ్మాయి కావాలని చేయించింది.
ఇంకెన్ని రోజులు అలాగే ఉంటారు. జీవితంలో పైకి ఎదగండి.
ఇద్దరూ దాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు వెళుతున్నారు. మీరూ మర్చిపోండి. మీ పని మీద దృష్టి పెట్టండి. మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి'' అని సమంత ట్వీట్ చేశారు. అదీ సంగతి! (Samantha Response On Naga Chaitanya Dating Rumour)


Also Read: 'రాకెట్రీ' సినిమాలో షారుఖ్, సూర్య గెస్ట్ రోల్స్ - ఎంత ఛార్జ్ చేశారంటే?


అక్కినేని నాగచైతన్య డేటింగ్ పుకార్లకు కూడా తనను నిందించడం పట్ల సమంత స్పందించడం చూస్తుంటే... ఈ పుకార్లు ఆమెను ఇరిటేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. 


Also Read: వికటించిన సర్జరీ - గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్!