AP Government Shock To Visakha Sarada Peetha: విశాఖ శారదా పీఠానికి (Sarada Peetham) ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా పెందుర్తి (Pendurthi) మండలం చినముషిడివాడలోని శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయించింది. బహిరంగ మార్కెట్‌లో ఎకరా దాదాపు రూ.15 కోట్లు ఉండగా.. ఎకరా రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలకు కేటాయించేశారు. అప్పటి లెక్కల ప్రకారం 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లుగా ఉంది. అంతటి విలువైన స్థలాన్ని తక్కువ ధరకే శారదా పీఠానికి కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. అంతే కాకుండా.. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదా పీఠం చేపట్టిన నిర్మాణంపైనా చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.

Continues below advertisement


Also Read: Pawan Kalyan: జనసేనలోకి ముద్రగడ కుమార్తె - కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని పవన్ కల్యాణ్