వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీ ఉండేలా చూడాలన్నారు. దీంతో రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ధరల విషయంలో రైతులకు నిరాశాజనక పరిస్థితులు ఉంటే మార్కెట్లో జోక్యం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకోవాలని సీఎం అన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది పడకుండా చూడాలన్న సీఎం జగన్ అన్నారు. ఆర్బీకేల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతుందన్నారు. నాణ్యత ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు మంచి ధరలకు లభిస్తున్నాయన్న సీఎం... బయట మార్కెట్లో డీలర్‌ అమ్మే రేట్లకన్నా తక్కువ రేట్లకు లభిస్తున్నాయన్నారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి వస్తున్నాయని సీఎం తెలిపారు. 


Also Read: "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !


సబ్ డీలర్లుగా ఆర్బీకేలు


ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే రబీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తోందన్న అధికారులు తెలిపారు. రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.  వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారుకు సూచించారు. బోర్ల కింద వరిని సాగుచేసే చోట ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సాహించాలని సీఎం జగన్ అన్నారు. మిల్లెట్స్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. 33 చోట్ల సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ డిసెంబరు నాటికి 20 యూనిట్లు అందుబాటులోకి తీసుకుమన్నారు. 





Also Read: బద్వేలులో త్రిముఖ పోటీ.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ !


అమూల్ ప్రైవేటు సంస్థ కాదు


బీఎంసీల నిర్మాణంపై వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ప్రాధాన్యతా క్రమంలో బీఎంసీలను డిసెంబర్‌ నాటికి పూర్తిచేస్తామన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చేపట్టిన జిల్లాల్లో పాల సేకరణ అంతకంతకూ పెరుగుతోందన్న సీఎంకు అధికారులు తెలిపారు. రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపైనా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అమూల్‌ ప్రైవేటు సంస్థ కాదన్న సీఎం... పెద్ద సహకార ఉద్యమమని గుర్తుచేశారు. పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులని సీఎం జగన్ తెలిపారు. అమూల్‌ వచ్చాక  పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతోందన్నారు. పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపైనా సమీక్షించిన సీఎం 
జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో పనులపై ఆరాతీశారు.  


Also Read: పాదయాత్రలో చూసి కష్టాలు తీరుస్తున్నా .. ! రెండో విడత ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ !


ఎక్కడా ఎరువుల కొరత లేదు : మంత్రి కన్నబాబు


ఏపీలో ఎక్కడా ఎరువుల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులపై సీఎం జగన్ సమీక్షించారని తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దుష్ర్పచారం జరుగుతోందన్నారు. నాణ్యతతో కూడిన ఎరువుల మందులు ఇవ్వడమే రైతు భరోసా కేంద్రాల లక్ష్యమన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీతో డీలర్ల కడుపు కొడుతున్నామన్న ఆరోపణలు సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎరువుల ఉత్పత్తి తగ్గిందని ఆయన తెలిపారు. 






Also Read: తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి