ఏపీ బీజేపీ నేతలవి మరగుజ్జు ఆలోచనలు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. 'రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉండే మీవంటి వారితో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో ఏపీ బీజేపీ లేదు' అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. నిత్యం ల్యాండ్, శాండ్, వైన్ లతో పేద ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న వైసీపీ మాకు హితబోధ చేస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ భూములపై కన్నేసి మూడు రాజధానులని కుట్రలు చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శలు చేశారు.
Also Read: సోము వీర్రాజుకు కింగ్ జార్జ్ పేరూ నచ్చలేదు ..కేజీహెచ్ పేరు మార్చాలని డిమాండ్!
బీజేపీ అధికారంలోకి వచ్చాక పేర్లు మారుస్తాం
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది బీజేపీ అని సోము వీర్రాజు అన్నారు. అమరావతిలో అభివృద్ధి, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ, ప్రత్యేక ప్యాకేజీ నిధులు, రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి ఏపీను అభివృద్ధి చేస్తున్నదీ నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని సోము వీర్రాజు అన్నారు. గుంటూరులో జిన్నా టవర్, విశాఖ కేజీహెచ్ పేర్లు మార్చకపోతే...బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా పేర్లు మారుస్తామని స్పష్టం చేశారు.
Also Read: గుంటూరులో టవర్ కు జిన్నా పేరు తొలగించాలి... బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్
అమరావతిని రాజధాని చేస్తాం
బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేస్తామని మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. సోమవారం వత్సవాయి మండలం గోపినేనిపాలెంలో పర్యటించిన ఆయన...కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలకు జగన్ అన్న పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులు అందిస్తుందని పేర్కొన్నారు. దీనిని రాష్ట్రం ప్రభుత్వం తమ సొంత నిధులుగా ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి చేసింది శూన్యమన్నారు.
Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి