ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 25,197 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 164 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో తాజాగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,426కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 196 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,54,252 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,392 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,906కి చేరింది. గడిచిన 24 గంటల్లో 196 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,426కు చేరింది. 


Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం


గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన వేరియంట్


కరోనా కేసులు తగ్గి ఉండవచ్చు, కానీ ప్రమాదం ఇంకా పొంచే ఉంది. ఎప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందనే భయం ఇంకా ప్రజల్ని వీడలేదు. ఈ సమయంలో అమెరికాలో చేసిన ఓ అధ్యయనం కలవరం రేపుతోంది. డెల్టా వేరియంట్ వచ్చాక గర్భస్థ శిశు మరణాలు, ప్రసవంలో శిశుమరణాల రేటును పెంచిందని ఆ అధ్యయనం తెలియజేస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం కోవిడ్ లేనివారితో పోలిస్తే, కోవిడ బారిన పడిన గర్భిణుల్లో చనిపోయిన శిశువును ప్రసవించే అవకాశం లేదా, ప్రసవించిన కొన్ని నిమిషాల్లో శిశువు చనిపోయే శాతం నాలుగు రెట్లు పెరిగిందని తేలింది. ఈ అధ్యయనాన్ని అమెరికా ప్రభుత్వం నిర్వహించింది. 


Also Read: ఆరోగ్యాన్ని వేయించుకుని తినేయకండి... వేపుడు వంటకాలతో వచ్చే రోగాలు ఇవే
 
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం మార్చి 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య అమెరికాలో దాదాపు 12 లక్షల కంటే ఎక్కువ ప్రసవాలు జరిగాయి. వాటిలో 8,154 ప్రసవాల్లో శిశుమరణాలు సంభవించాయి. వాటిలో కూడా డెల్టా వేరియంట్ రాకముందు కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లులకు పుట్టిన శిశువుల్లో మరణాలు తక్కువగా నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో బాధపడుతున్న గర్భిణుల్లో మాత్రం శిశుమరణాలు అధికంగా నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ వల్ల శిశు మరణాల రేటు నాలుగు రెట్లు పెరిగినట్టు లెక్క తేల్చింది అమెరికా ఆరోగ్య సంస్థ. 


Also Read:  కరోనా నియంత్రణలో మరో ముందడుగు.. ఫైజర్‌ నిర్ణయంతో 95 పేద దేశాలకు కొవిడ్‌ మాత్ర