ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,383 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 495 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,708కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,543 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,92,396 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 8,421 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,525కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,29,38,630 నిర్థారణ పరీక్షలు చేశారు. 






తెలంగాణలో కొత్తగా 425 కరోనా కేసులు


తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,042 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 425 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసులు 7,86,021కు చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా మరణాలు సంభవించలేదు. కరోనా బారి నుంచి గురువారం 1,060 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 6,111 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం 130 కరోనా కేసులు నమోదయ్యాయి.


దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 25,920 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 66,254 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారంతో పోలిస్తే రోజువారి కరోనా కేసులు 4,837 తగ్గాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 2,92,092కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 2.07గా ఉంది. రికవరీ రేటు 98.12గా ఉంది. ఒక్కరోజులో 492 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.68గా ఉంది.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 174.64 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం 12,54,893 కరోనా పరీక్షలు నిర్వహించారు. 


Also Read: Kerala Bus Owner: కరోనా దెబ్బకు విలవిల, బస్సులను కిలో రూ.45కు విక్రయించిన ఓనర్


మహారాష్ట్రలో 


మహారాష్ట్రలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,53,291కి పెరిగింది. 1,43,532 మంది మృతి చెందారు. జనవరి 21 నుంచి దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Also Read: Karnataka Hijab Controversy: విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు ధరించవద్దు, కర్ణాటక మైనారిటీ శాఖ కీలక ఆదేశాలు