జిల్లాల పునర్విభజన నెల్లూరు జిల్లా(Nellore District)లో కాకరేపుతోంది. జిల్లాల విభజనపై అధికార వైసీపీ నేతల(Yrscp Leaders) నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. జిల్లాల పునర్విభజన(Distrcit Reorganisation) గందరగోళంగా మారిందని మాజీమంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandramohan Reddy) విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చుని విభజన చేయడం ఏమిటని ప్రశ్నించారు.  నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాల విభజనకు తాము వ్యతిరేకించడం లేదని, అయితే పార్లమెంట్(Parliament) నియోజకవర్గాల వారీగా  ఏర్పాటు చేయడం మంచిదికాదన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా విభజన చేపట్టడం దారుణమన్నారు. నెల్లూరును విభజించవద్దని రెండేళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీ(TDP) స్పష్టమైన ప్రకటన చేసిందన్నారు. 


నెల్లూరు జిల్లాను విభజించవద్దు 


నెల్లూరు జిల్లాను విభజిస్తే సోమశిల(Somasila), కండలేరు(Kandaleru) జలాశయాల కిందున్న ఆయకట్టు పరిస్థితి అయోమయంలో పడుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramaranayana Reddy), వైసీపీ నేతలకు ముఖ్యమంత్రిని కలిసే దమ్ము లేదన్నారు. విభజన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోలేని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి(MLA Kakani) సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను గౌరవించి నెల్లూరు జిల్లాను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 


ఆనం రామనారాయణ మూర్తి వ్యతిరేకత 


జిల్లాల విభజనకు వ్యతిరేకంగా ఆనం తిరుగుబాటు జెండా ఎగరేశారు. కలెక్టర్‌కు (Collector ) వినతి పత్రం ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా జిల్లాల విభజన చేస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ( Congress ) పరిస్థితే వైఎస్ఆర్‌సీపీకి ఏర్పడుతుందని హెచ్చరించారు. జిల్లాల అశాస్త్రీయ విభజన వల్ల సోమశిల రిజర్వాయర్ నీటి వాటాల్లో గొడవలు జరుగుతాయని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలిన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారన్నారు. మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా  ప్రజలు సిద్ధంగా లేరని ఆనం ప్రభుత్వానికి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల  పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా నెల్లూరు-బాలాజీ జిల్లా పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గతంలో కూడా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ గళం విప్పుతున్నారు. 


Also Read: ఆనం వర్సెస్ నేదురుమల్లి ! నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో రచ్చ రచ్చ