ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 32,630 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 208 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,415కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 247 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,52,477 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 3,086 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: ఇండియాలో 17 నెలల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు.. భారీగా తగ్గిన కొవిడ్19 మరణాలు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,978కి చేరింది. వీరిలో 20,52,477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 247 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3,086 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,415కు చేరింది.
Also Read: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
భారత్ లో కేసులు
ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా 17 నెలల కనిష్ఠానికి దేశంలో కరోనా కేసులు చేరుకున్నాయి. మరోవైపు కరోనా మరణాలు క్రితం రోజుతో పోల్చితే సగానికి పైగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 11,271 కొత్త కేసులను నిర్ధారించారు. నిన్న ఒక్కరోజులో 285 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. క్రితం రోజుతో పోల్చితే కొవిడ్ మరణాలు భారీగా తగ్గాయి. దేశంలో ఇప్పటివరకూ 4,63,530 మంది మహమ్మారికి బలయ్యారు.
Also Read: అంతర్జాతీయ వేదికపై భారత్ కీలక విజయం.. ఏకంగా 200 దేశాలతో..
భారత్‌లో నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. నిన్న ఒక్కరోజులో కేరళ నుంచే 6,468 కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నిన్న 11,376 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918 (ఒక లక్షా 35 వేల 918)కు దిగొచ్చింది. కాగా, గత 522 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ 3,44,37,307 (3.44 కోట్ల) మంది కరోనా బారిన పడగా అందులో 3,38,37,859 (3.38 కోట్ల) మంది కోలుకున్నారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.26 శాతానికి చేరింది.
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?