ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,362 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 262 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,411కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 229 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,51,976 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 3,227 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,614కి చేరింది. వీరిలో 20,51,976 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 229 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,411కు చేరింది.
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
భారత్ లో కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా 15 వేల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 12,516 కేసులు నమోదుకాగా 501 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,416కు పెరిగింది. గత 267 రోజుల్లో ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 3,44,14,186
- మొత్తం మరణాలు: 4,62,690
- యాక్టివ్ కేసులు: 1,37,416
- మొత్తం రికవరీలు: 3,38,14,080
Also Read: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి