ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజలు బిచ్చమెత్తుకుని బతకాల్సి వస్తుందని అప్పట్లో ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారన్నారు. కానీ ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వానికి నిధులు లేక కేంద్రం వద్ద చేతులెత్తి అడుక్కుంటోందని విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఏం చెప్పినా ఏపీ సీఎం జగన్ చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పనిసరి కాబట్టి ఏపీలో మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశమంతా మీటర్లను వ్యతిరేకిస్తుంటే సీఎం జగన్ మాత్రం కేంద్రం చెప్పింది వింటూ కీలుబొమ్మగా మారారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
Also Read: యాసంగి వడ్లు కొంటరా ? కొనరా? తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు !
పేర్ని నాని కౌంటర్
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ పై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి న్యాయపరంగా రావాల్సిన నిధుల కోసం పోరాడుతున్నామని మంత్రి అన్నారు. "తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే దిల్లీ వెళ్తున్నారు కదా... ఆయనెందుకు వెళ్తున్నారు. ఏం అడుక్కోడానికి వెళ్తున్నారు. కేంద్రంలో మేము చేరతాం... మా తలుపులు తెరిచే ఉన్నాయని తెలంగాణ నేతలు చెప్తున్నారు. ఇంటి బయట కాలర్ ఎగరేసి... ఇంట్లో కాళ్లు పట్టుకోవడం, జగన్ కు చేతకాదు. జగన్ కు దోస్తీ అంటే దోస్తీ సై అంటూ సై. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తుంది. హైదరాబాద్ ను అన్యాయంగా పంచేసుకుని కబుర్లు చెబుతున్నారు. పాడికుండ లాంటి హైదరాబాద్ ను పంచేసుకుని ఇప్పుడు కబర్లు చెబుతున్నారు. ఎవడి మీదో అక్కసు కక్కలేక ఏపీపై విమర్శలు చేస్తున్నారు" అని మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు.
Also Read: పంచ్ ప్రభాకర్ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?
టీడీపీలాగే టీఆర్ఎస్ మాట్లాడుతుంది : సజ్జల
ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు వారి విచక్షణకే వదిలేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించటం సరికాదని అన్నారు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని సీఎం కేసీఆర్ అన్నారని, ఈ మాటలు తెలంగాణ మంత్రులు వినబడలేదా అని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతి అవలంబిస్తుందన్నారు. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకన్న సజ్జల.... కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో టీడీపీ నేతల్లాగే టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.
Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి