ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,312 నమూనాలను పరీక్షించగా వారిలో 624 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో 20,57,252 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా శనివారం నలుగురు మరణించారు.  ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,254కు చేరింది. తాజాగా 810 మంది కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 20,35,054కు చేరింది. రాష్ట్రంలో 7,944 క్రియాశీలక కేసులున్నాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,87,44,941 నమూనాలను పరీక్షించింది.






Also Read:  దేశంలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 18,166 కేసులు నమోదు


తెలంగాణలో కొత్తగా 162  కేసులు


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 33,506 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 162 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 6,67,887కి కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. శనివారం కరోనాతో ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 3,930కు చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 214 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 4,235 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Also Read: సెంచరీ మార్క్ దిశగా భారత్.. జెట్ స్పీడుతో వ్యాక్సినేషన్!


దేశంలో కరోనా కేసులు


భారత్​లో కరోనా కేసులు గురువారంతో పోలిస్తే భారీగా తగ్గాయి. తాజాగా 20 వేల దిగువగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 19,740 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.​248 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. శుక్రవారం 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల కనిష్ఠానికి చేరింది. శుక్రవారం 12,69,291 కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దేశంలో నిన్న 79,12,202 కొవిడ్​టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 93,99,15,323కి చేరింది.  


మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.71%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 97.96%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యధికం. గత 24 గంటల్లో 24,963 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 


Also Read: దసరా పండగకి ప్రత్యేక రైళ్లు... ప్రకటించిన ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే... వివరాలు ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి