కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి 20 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,166 కొత్త కేసులు నమోదుకాగా 214 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,30,971కి పెరిగింది. గత 2016 రోజుల్లో ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.








    • యాక్టివ్ కేసులు: 2,30,971

    • మొత్తం రికవరీలు: 3,32,71,915

    • మొత్తం మరణాలు: 4,50,589

    • మొత్తం వ్యాక్సినేషన్: 94,70,10,175







మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.71%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 97.96%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యధికం.


గత 24 గంటల్లో 24,963 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 2,486 కొత్త కేసులు నమోదయ్యాయి 59 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 65,75,578కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,39,470కి పెరిగింది.


ప్రపంచవ్యాప్తంగా..


ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో క్రమంగా తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,49,956 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 5,520 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,83,51,150కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,62,825కు పెరిగింది.


Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం


Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు


Also read: మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం... అధిక ఆలోచనలతోనే ముప్పు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి