దసరా స్పెషల్ రైళ్లను ప్రకటించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. రద్దీ మార్గాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక పూజా స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్(08579) వీక్లీ రైలు అక్టోబర్ 13, 20, 27 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7కు బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08580) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) స్పెషల్ విశాఖపట్నంలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08586) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 20, 27, నవంబరు 3 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు స్టార్ట్ అవుతుంది.
విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ విశాఖలో అక్టోబర్ 18, 25, నవంబర్ 1వ తేదీల్లో రాత్రి 7.15 గంటలకు రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతికి రైలు చేరుకుటుంది. తిరుగు ప్రయాణంలో(08584) తిరుపతిలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9.55 బయలుదేరిన రైలు మరుసటిరోజు ఉదయం 10.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
దక్షిణ మధ్య రైల్వే పండగ స్పెషల్
దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మహారాష్ట్రలోని పూర్ణ రైల్వే జంక్షన్ - తిరుపతికి మధ్య ఈ నెల 11, 18, 26వ తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తిరుపతి నుంచి పూర్ణకు 12, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- నర్సాపూర్ మధ్య దసరా ప్రత్యేక రైలు (07456) అక్టోబర్ 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. నర్సాపూర్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు (07455) అక్టోబర్ 17న సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07053) అక్టోబర్ 14న రాత్రి 10.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ చేరుతుంది.
Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్
మరిన్ని రైళ్లు
కాకినాడ టౌన్- సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07455) అక్టోబర్ 17న రాత్రి 10.45 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగనుంది. సికింద్రాబాద్-అగర్తలా ప్రత్యేక రైలు (07030) అక్టోబర్ 11న అందుబాటులోకి రానుంది. అగర్తలా-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07029) అక్టోబర్ 15న నడవనుంది. శుక్రవారం ఉదయం 6.10 గంటలకు రైలు అగర్తలాలో బయల్దేరి ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది.
Also Read: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్