7th Pay Commission Latest News: ఆ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పండుగ బోనస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన వారికి బోనస్ ఇవ్వనున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దాదాపు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేర నిర్ణయం తీసుకుంది.


నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులలో ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సిబ్బందికి ఈ బోనస్ వర్తించదని క్లారిటీ ఇచ్చారు. దీపావళి బోనస్ మొత్తంగా 11.56 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. భేటీ అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.


Also Read: మామ ఆస్తిపై హక్కు కోసం కోర్టును ఆశ్రయించిన అల్లుడు.. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే!






కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ అందిస్తోంది. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలి. కానీ ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బోనస్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,985 కోట్ల మేర బారం పడనుందని అనురాగ్ ఠాగూర్ తన ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ దసరా పండుగ నేపథ్యంలో నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి అందించిన సేవలకుగానూ ఈ బోనస్ అందుకోనున్నారు.


Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్


దేశ వ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కుల ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లను నిలిపివేయడం తెలిసిందే. మూడు దఫాలుగా వాయిదా పడిన డీఏను కేంద్రం జూన్ నెలలో అమోదించింది. డీఏను 17 శాతం నుంచి 25శాతానికి పెంచింది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి