కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 210 రోజుల్లో ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.73%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
యాక్టివ్ కేసుల సంఖ్య 2,46,687గా ఉంది. గత 203 రోజుల్లో ఇదే అత్యల్పం. కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.94%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
గత 24 గంటల్లో 24,770 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,31,75,656కు పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.68%గా ఉంది. గత 103 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువే ఉంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 57.68 కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. 92.17 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
కేరళలో..
కేరళలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 9,735 కరోనా కేసులు నమోదుకాగా 151 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 124509కి పెరిగింది.
మొత్తం 14 జిల్లాల్లో త్రిస్సూర్‌లో (1367) అత్యధిక కేసులు నమోదయ్యాయి. తరువాత తిరువనంతపురం (1156), ఎర్నాకులం (1099) ఉన్నాయి.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో కొత్తగా 2,401 కేసులు నమోదుకాగా 39 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,64,915కు చేరగా మరణాల సంఖ్య 1,39,272కు పెరిగింది.