లఖింపుర్ ఘటనను ఉపయోగించుకుని హిందువులు, సిక్కుల మధ్య విబేధాలు సృష్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు భాజపా నేత వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
సంచలన వ్యాఖ్యలు..
లఖింపూర్ ఘటనపై వరుణ్ గాంధీ గురువారం స్పందిస్తూ, నిరసనకారులపైకి కారు దూసుకెళ్లిన వీడియోను పోస్ట్ చేశారు. నిరసనకారుల గళాన్ని హత్యల ద్వారా నొక్కకూడదన్నారు. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీతనం ఉండాలని ట్వీట్ చేశారు. రైతులకు న్యాయం చేయాలన్నారు.
లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న జరిగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు సిక్కులు ఉన్నారు. బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ దినేశ్ చంద్ర సింగ్ సిక్కులకు గుర్ముఖి లిపిలో ఓ లేఖ రాశారు. ఈ సంఘటన అనంతరం సంయమనం పాటించినందుకు సిక్కులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘటనను ప్రభుత్వం, ప్రజలు సహా అందరూ ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.