ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 47,420 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 12,615 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఐదురుగు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,527కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 3,674 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,658 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 53,871 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,49,056కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,674 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,527కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,20,12,102 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: అప్పుడు రెమిడిసివిర్, ఇప్పుడు కాక్‌టైల్.. కరోనా సోకితే ఇది తప్పకుండా వాడాలా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్కరోజులో కొత్తగా 3,17,532 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 491 మంది మరణించారు మునుపటి రోజు కంటే 12.22 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
- మొత్తం కేసులు: 3,82,18,773
- మొత్తం మరణాలు: 4,87,693
- యాక్టివ్ కేసులు: 19,24,051
- మొత్తం కోలుకున్నవారు: 3,58,07,029
డైలీ పాజిటివిటీ రేటు 16.41 వద్ద ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 19,24,051కి చేరింది. నిన్న ఒక్కరోజులో 2,23,990 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.69గా ఉంది.
వ్యాక్సినేషన్..
దేశంలో ఇప్పటివరకు 1,58,96,34,485 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. బుధవారం ఒక్కరోజే 73 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజులో 19,35,180 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Also Read: దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో 3 లక్షలకు పైగా కేసులు