దేశంలో కొత్త రైల్వే జోన్ల ప్రతిపాదనలేవీ లేవని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు లోక్‌సభలో మాట్లాడారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు మార్గాని భరత్, సత్యవతి మాట్లాడారు. అయితే వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు పరస్పర విరుద్ధమైన ప్రసంగాలు చేయడం గందరగోళ పరిచింది. 


విశాఖ రైల్వే జోన్ ఉందా ? లేదా ? : రామ్మోహన్ నాయుడు 


2019లో దక్షిణకోస్తా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి ముందడుగూ లేదు. అదే సమయంలో కొత్త రైల్వేజోన్లు ఏర్పాటు చేసే అవకాశమే లేదని కేంద్రం రాజ్యసభకు తెలిపింది. ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని తెలిపింది ఆ పదిహేడింటిలో విశాఖ జోన్ లేదు. ఈ అంశాన్ని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో లేవనెత్తారు.  2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం కొత్త జోన్‌ ఏర్పాటుపై ప్రకటన చేసినా ఇంత వరకూ పురోగతిలేదని న్నారు.  మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని ప్రశ్నించారు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.  40 లక్షలు మాత్రమే కేటాయించారనీ.. అంత చిన్న మొత్తంతో జోన్ ఏర్పాటు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో గానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అంశాన్ని కేంద్రం చేర్చలేదని ఇది ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. దీనిపై తక్షణం కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. 


Also Read : సోమవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే చాన్స్... ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష


కేంద్రం గందరగోళం సృష్టిస్తోంది ! : మార్గాని భరత్ 


రైల్వే జోన్ అంశంపై కేంద్రం గందరగోళం సృష్టిస్తోందని జీరో అవర్‌లో ఇదే అంశంపై మాట్లాడిన రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనల్లో రైల్వేజోన్ ప్రస్తావనే లేదన్నారు. పరస్పర భిన్నమైన ప్రకటనలు చేస్తూ రైల్వే జోన్ అంశంపై ఎటూ తేల్చడం లేదని విమర్శించారు. తక్షణం ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకుని రైల్వేజోన్ సమస్యను పరిష్కరించాలన్నారు. 


Also Read : ఏపీ మద్యం దుకాణాల్లో క్యాష్ ఓన్లీ.. పెద్ద స్కాంగా లోక్‌సభలో రఘురామ ఆరోపణ !


రైల్వేజోన్ ఇప్పటికే మంజూరైంది :  ఎంపీ సత్యవతి 


అయితే రైల్వే జోన్ అంశంపైనే స్పందించిన అనకాపల్లి ఎంపీ సత్యవతి భిన్నమైన వాదన వినిపించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇప్పటికే మంజూరు అయ్యిందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ను ఉంచాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. ‌అత్యధిక రెవెన్యూ ఇచ్చే డివిజన్ ఇదేనన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై ఇటీవలే డీపీఆర్ ఇచ్చారన్నారు. దీనికి త్వరలో 300 కోట్లు బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని చెప్పారు.


Also Read : గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి