ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఆందోళనల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పీఆర్సీని ప్రకటించే దిశగా ఆయన కసరత్తు ప్రారంభించారు. మూడో తేదీన తిరుపతిలో వారం, పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే వచ్చే సోమవారం కల్లా పీఆర్సీని ప్రకటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ గురువారం సమావేశం అయ్యారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చర్చించారు. 


Also Read : ఏపీ మద్యం దుకాణాల్లో క్యాష్ ఓన్లీ.. పెద్ద స్కాంగా లోక్‌సభలో రఘురామ ఆరోపణ !


మూడేళ్ల క్రితమే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. పీఆర్సీ నివేదికను మాత్రం బయట పెట్టలేదు. పీఆర్సీ విడుదల చేసి ఫిట్‌మెంట్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆందోళలకు దిగారు. ఈ క్రమంలో పీఆర్సీ కమిటీ చేసిన సిఫార్సులపై జగన్ సమీక్ష నిర్వహించారు. 


Also Read : గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !


కమిటీ సిఫార్సులను పరిశీలించి ఎంత మేర వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉద్యోగుల ఇతర డిమాండ్లపైనా చర్చించారు. ఆర్థిక పరమైన డిమాండ్లను తీర్చడానికి ఎంత వ్యయం అవుతుందో అధికారులు సీఎంకు వివరించినట్లుగా తెలుస్తోంది. సీపీఎస్ రద్దుకు ఉన్న ప్రతిబంధకాలనూ వివరించినట్లుగా సమాచారం.


Also Read : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...


మరో వైపు  గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ పూర్తయింది. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి ఆ మేరకు జీత భత్యాలను ఇవ్వాల్సి ఉంది. ఇతర డిపార్టుమెంటల్ పరీక్షలు కూడా రాసి వారంతా తమ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఎదురు చూసతున్నారు. ఈ క్రమంలో వారిని పర్మినెంట్ చేస్తే పడే ఆర్థిక భారంపైనా సీఎం చర్చించినట్లుగా భావిస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయాన్ని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: Tollywood Drugs : టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?


ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 34 శాతం ఫిట్‌మెంట్‌ను సోమవారం ప్రకటించ అవకాశం ఉందని తెలిస్ోతంది. మానిటరీ బెనిఫిట్‌ను 2022 జనవరి నుంచి వర్తింప చేస్తారు. అలాగే 2018 జూలై నుచి నోషనల్, 2021 ఏప్రిల్ నుంచి పీఎఫ్‌కి జమ చేస్తారని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి