ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 156 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ కారణంగా కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. గడచిన 24 గంటల్లో 188 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు.. 20,71,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,55,394 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మెుత్తం 14,465 మంది మరణించారు. ప్రస్తుతం 1,954 మంది చికిత్స పొందుతున్నారు.


దేశంలో కేసులు


భారత్ లో కొత్తగా 7,992 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 393 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 559 రోజుల కనిష్ఠానికి చేరింది.


మొత్తం కేసులు: 3,46,82,736
మొత్తం మరణాలు: 4,75, 128
యాక్టివ్ కేసులు: 93,277
కోలుకున్నవారు: 3,41,14,331


దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం 76,36,569 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,31,99,92,482కి చేరింది.


ఒమిక్రాన్ భయం


దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో రెండో కేసు నమోదయింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికాల్లో పర్యటించి వచ్చిన వ్యక్తి శాంపిల్స్‌ను అధికారులు పరీక్షించినప్పుడు అతనిలో ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటున్నాయి. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తున్నారు. 


సాధారణ కరోనా కేసులు దేశంలో తగ్గిపోతున్నాయి. కానీ కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి చెందుతుండటతో అధికారులు కూడా ఆందోళనచెందుతున్నారు.  ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు 32కి చేరాయి. నిన్న ఒక్కరోజే 9 మందిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ.. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  


Also Read: Delhi Omicron : ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ కేసు.. ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు !


Also Read: Minister Kannababu: చంద్రబాబు చూడాల్సింది అఖండ మూవీ కాదు జస్టిస్ చంద్రు వీడియో... ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడే హోదా కనుమరుగు


Also Read: రాయదుర్గంలో వేడెక్కిన రాజకీయాలు....కాలువ శ్రీనివాస్ వర్సెస్ కాపు రాంచంద్రారెడ్డి