Breaking News: రేవంత్ చిలక మనదే.. పలుకు పరాయిది.. మంత్రి కేటీఆర్ ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 27 Aug 2021 02:40 PM
తెలంగాణలో కొత్తగా 339 కోవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 80,568 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ మేరకు వెల్లడైంది. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 3,867కి చేరింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నిన్న ఒక్క రోజే 417 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 6.46 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌కు అదనపు బాధ్యతలు..

తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌కు పంజాబ్, ఛండీగర్ రాష్ట్రాల గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. 





విశాఖలో విషాదం.. కుమార్తె వివాహ సమయంలో తల్లిదండ్రుల బలవన్మరణం

కుమార్తె వివాహం ప్రారంభమైంది. మరికాసేపట్లో కన్యాదానం చేయాల్సి ఉంది. వధువు తల్లిదండ్రులు ఫంక్షన్‌హాల్‌ లో ఎక్కడా కనిపించట్లేదు. అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా.. విగత జీవులై పడి ఉన్నారు. మద్దిలపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పోర్టు విశ్రాంత ఉద్యోగి జగన్నాథరావు (63), ఆయన భార్య విజయలక్ష్మి (57)  తమ కుమార్తె వివాహం చేయాలని నిశ్చయించారు. వివాహ తంతు ప్రారంభమైంది. మరికాసేపట్లో కూతురికి కన్యాదానం చేయాల్సి ఉంది. వధువు తల్లిదండ్రుల కోసం బంధువులు ఫంక్షన్‌ హాల్‌ మొత్తం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. గదిలో విగతజీవులై కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. 
మానసిక సమస్యలే కారణమా?
పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కారణంగానే విజయలక్ష్మి తరచూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేదని... కుమార్తె పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడిందని బంధువులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు.. ఆమెను చంపి, తాను కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

రేవంత్ చిలక మనదే.. పలుకు పరాయిది: కేటీఆర్

‘‘రేవంత్ రెడ్డి స్థాయేంటో అందరికీ తెలుసు. ఆయన ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. ఆ చిలక మనదే.. పలుకు పరాయిది. ఆయన వెనక ఉన్నదెవరో.. మాట్లాడించేది ఎవరో..నాకే కాదు.. అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఫ్రాంఛైజీ లాగా తీసేసుకున్నాడు. రేవంత్‌ను బొమ్మ లెక్క నడిపిస్తుండు. చంద్రబాబు ఆడించే తోలుబొమ్మలాటలో ఒక బొమ్మ అంతే. ఈ గజ్వేల్ సభ అంతా లొల్లి ఎందుకు? మంత్రి మల్లన్న చెప్పినట్లు రాజీనామా చెయ్ సూద్దం. అడనే చూస్కుందం.’’ అని కేటీఆర్ అన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పిటిషన్లపై విచారణ వాయిదా

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 8కి ఎన్జీటీ చెన్నై బెంచ్‌ వాయిదా వేసింది. నివేదిక అందించేందుకు అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ సమయం కోరడం వల్ల విచారణను వాయిదా వేసినట్లు ట్రైబ్యునల్ తెలిపింది. 

జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ ద్వారా నిధుల కేటాయింపుపై ఆలోచించాలని లేఖలో సూచించింది. అనుమతి లేని ప్రాజెక్టుగా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టుకు నిధులు ఎలా సమకూరుస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కూడా లేవని తెలంగాణ పేర్కొంది.

కరీంనగర్: దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం

కరీంనగర్ కలెక్టరేట్‌లో దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ప్రారంభమైంది. ఈ సమీక్షకు మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

టీఆర్ఎస్ నేత కుమార్తె పెళ్లికి కేసీఆర్ హాజరు

కరీంనగర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలుగునూర్‌లో టీఆర్‌ఎస్‌ కార్మిక నేత రూప్‌సింగ్‌ కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు. అనంతరం కరీంనగర్‌ చేరుకున్నారు. దళితబంధు పథకం అమలుపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమా‌వేశం నిర్వహిస్తారు.

హుజూరాబాద్‌లో దళితబంధు కోసం ఇంటింటి సర్వే ప్రారంభం

దళితబంధుపై హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే ప్రారంభం అయింది. ఇందులో భాగంగా వీణవంక ఎస్సీ కాలనీలో జరిగిన సర్వే కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి మహేశ్వర్‌ పాల్గొన్నారు. మండలంలోని బేతిగల్‌లో జరిగిన సర్వేలో ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి, డీఆర్డీవో శ్రీలత పాల్గొన్నారు. మామిడ్లవాడలో సర్వే కోసం వచ్చిన అధికారులకు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడులో సర్వే అధికారులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 350 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. రోజుకు 100-150 ఇళ్లు సర్వే చేయనున్నారు.

అస్సాంలో ఐదుగురు సజీవ దహనం

అస్సాంలో ఆగంతకులు చేసిన పనికి ఐదుగురు సజీవ దహనమయ్యారు. దిమా అసవో జిల్లాలో ఏడు వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మంగళగిరి రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో ఢీకొని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీకి చెందిన దంపతులు మృతి చెందారు. దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొట్టింది. దంపతులు సురేష్‌, రమణమ్మలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఉద్రిక్తతగా ఇందిరా శోభన్ యాత్ర.. అరెస్టు

కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంటలో వైఎస్సార్‌టీపీ మాజీ నేత ఇందిరా శోభన్ ఉపాధి భరోసా యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఇందిరా శోభన్ గొడవకు దిగారు. చివరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ యాత్ర కోసం రెండ్రోజుల క్రితమే అనుమతి కోసం కమిషనర్‌కు లెటర్ ఇచ్చామని ఇందిరా శోభన్ వెల్లడించారు. మొదట పాదయాత్రకు అనుమతిచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నారని ఆమె ఆరోపించారు.


Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్‌ రెడ్డిపై అసంతృప్తే కారణమా?

మెదక్ జిల్లాలో హత్య.. శవాన్ని కాల్చేసి దారుణం

మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తిని చంపేసి తగలబెట్టారు. కొల్చారం శివారులో ఈ ఘటన జరిగింది.  లోతువాగు వద్ద గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కారులో తీసుకొచ్చి తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 22,072 మంది భక్తులు దర్శించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం  రూ.1.88 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నిన్న స్వామివారికి 10,095 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 


 

దేశంలో తాజాగా 44 వేల కరోనా కేసులు, 496 మరణాలు

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య వరుసగా రెండో రోజూ 40 వేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,658 మంది వైరస్​ సోకింది. మరో 496  మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 32,988 మంది కరోనా​ను జయించారు.

కలెక్టర్ బంగ్లాలో కూలిన పైకప్పు

అనంతపురంలో జిల్లా కలెక్టర్ భవనంలోని ఓ గది పైకప్పు కూలింది. కూలిన ప్రదేశంలో ఎవరు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. జిల్లా కలెక్టర్ నివాసముండే బంగ్లాలో డ్రాయింగ్ రూమ్ దాదాపు 150 ఏళ్ల క్రితం నాటిది. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు పైకప్పు శిథిలమైంది. వీటికి  మరమ్మత్తులు చేపడతామని అధికారులు తెలిపారు. 

గుంటూరులో నలుగురు మైనర్లు అదృశ్యం

గుంటూరులో నలుగురు మైనర్లు అదృశ్యం కలకలం రేపింది. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన నలుగురు మైనర్లు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. వారిలో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికల వయస్సు 14, 15 ఏళ్లు కాగా బాలుర వయస్సు 13, 17 ఏళ్లు అని చెప్పారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇంటి వద్ద పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు భావించారు. చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో గురువారం రాత్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుంటూరులో నలుగురు మైనర్లు అదృశ్యం

గుంటూరులో నలుగురు మైనర్లు అదృశ్యం కలకలం రేపింది. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన నలుగురు మైనర్లు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. వారిలో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికల వయస్సు 14, 15 ఏళ్లు కాగా బాలుర వయస్సు 13, 17 ఏళ్లు అని చెప్పారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇంటి వద్ద పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు భావించారు. చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో గురువారం రాత్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Background

కర్నూలు జిల్లా అల్లూరు సబ్ రిజిస్టర్ శ్రీనివాసులును  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్ సస్పెండ్ చేశారు.  రెండు రోజుల క్రితం అల్లూరు రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది.   లెక్కల్లో చూపిన రూ.75 వేల నగదు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై విచారించిన డీఐజీ కిరణ్ కుమార్, సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు సస్పెండ్ చేశారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.