Guntur Tragedy 2 Labour Dies: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అమరావతి రోడ్డు (Amaravati Road In Guntur)లోని ముత్యాలరెడ్డి నగర్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న చిక్కుకున్న కూలీలను బయటకు తీసేందుకు సహాచక చర్యలు చేపట్టారు. ఈ కూలీ ఉపాధి కోసం బిహార్ (Bihar Labour) నుంచి ఇక్కడికి వలస వచ్చారు. మరో డెడ్‌బాడీని వెలికి తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరుకోగా, మిగతా కూలీలు సైతం చనిపోయి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.


అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇందుకోసం ముత్యాలరెడ్డి నగర్‌లో పెద్ద భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 40అడుగుల మేర పునాదులు తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడడ్డాయి. ఈ ప్రమాదంలో మొదట ఒకరు చనిపోగా, మరో నలుగురు కూలీలు గాయపడ్డట్లు సమాచారం. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న కూలీలను వెలికి తీసేందుకు సహాయచర్యలు చేపట్టగా మరో కూలి డెడ్‌బాడీ లభ్యమైంది. అక్కడే ఉన్న ఇద్దరు కూలీలు అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.


షాపింగ్ మాల్ కోసం పనులు.. పూర్తి నిర్లక్ష్యం..
ఎస్వీ బిల్డర్స్ అండ్ అసోసియేషన్ అమరావతి రోడ్డులో ఈ నిర్మాణ పనులు చేపట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణం కోసం దాదాపు 40 అడుగుల మేర లోతుగా తవ్వుతుండగా కార్మికులపై మట్టిపెళ్లలు విరిగిపడటంతో విషాదం జరిగింది. కూలీ భద్రతకు సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. తలకు ఎలాంటి హెల్మెట్ లేకుండా కార్మికులు పనిచేస్తున్నారని గుర్తించారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం, నిబంధనలు ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. మట్టి కింద కూరుకుపోయి ఊపిరాడక పోవడం వల్ల కూలీలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని స్థానికులు అన్నారు. 


ఇటీవల పర్మిషన్ల కోసం కొన్ని రోజులు పనులు నిలిపివేశారు. రెండు రోజుల కిందట మళ్లీ తవ్వకం పనులు మొదలుపెట్టగా అంతలోనే విషాదం చోటుచేసుకుంది. కూలీలకు తలకు ఎలాంటి గాయాలు అవ్వకుండా ఉండేందుకు హెల్మెట్లు కూడా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్వీ బిల్డర్స్ అండ్ అసోసియేషన్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Also Read: AP Assembly News: ఏపీ అసెంబ్లీలో వెనక్కితగ్గని టీడీపీ నేతలు - నేడు 11 మంది సస్పెన్షన్


Also Read: Jangareddygudem Issue: ‘కడుపులో కాలిపోయి ఉన్నా సహజ మరణమా? ఇదంతా మన ఆంధ్రుల కర్మ’ - నాగబాబు