Free Bus Travel For Women In Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే కీలకమైన రెండు హామీలు అమలుచేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోంది. సామాజిక పింఛన్లు కూడా పెంచి అందిస్తున్నారు. అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. ఇప్పుడు కీలకమైన మరో రెండు హామీలు అమలు కోసం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం. దసరా, దీపావళి కానుగా మరో రెండు కానుకలు అందజేయాలని భావిస్తున్నారు. 


దసరా నుంచి ఉచిత బస్ పథకం 


కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన హామీల్లో ఒకటి ఉచిత బస్‌ ప్రయాణం. ఏపీఎస్‌ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీని దసరా నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యంపై స్టడీ చేసింది. 


మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ఎలా అమలుచేయాలని ఏ ఏ బస్‌లో ఈ స్కీమ్‌ ప్రవేశ పెట్టాలనేది ఇప్పటికే డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది. అయ్యే ఖర్చు ఎంత లాంటి సమగ్ర వివరాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 


ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల లెక్కలు గమనిస్తే... రాష్ట్రంలో 42 లక్షల మందిని ప్రతి రోజూ 11 వేల 500 బస్‌లు గమ్యస్థానాలు చేరుస్తున్నాయి. ఇందులో మహిళలు 40 శాతం వరకు ఉంటారని ఓ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వాళ్లలో చాలా మందికి ఉచితర ప్రయాణ సౌకర్యంల లభించనుంది. ఇప్పటి వరకు రోజూ 13 నుంచి 16 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం వస్తోంది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం లభిస్తే మాత్రం నెలకు 3 వేల కోట్ల వరకు భారం పడుతుందని ఓ అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వం భరించేలా కసరత్తు చేస్తున్నారు.  


దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు


దీపావళి నుంచి అందించే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కూడా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 826 రూపాయలు ఉంది. ఒక్కో కుటుంబానికి ఏడాది మూడు ఉచిత సిలిండర్లు అంటే ఒక కుటుంబానికి ఏడాది 2,478 రూపాయల లబ్ధి చేకూరుతుందని అర్థం. ఈ లెక్కన రాష్ట్రంలో 1.55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై 3,640 కోట్ల భారం పడబోతోంది. అయితే అందరికి ఇది అమలు సాధ్యం కాదని కొన్ని పరిమితులు విధించే అవకాశం లేకపోలేదు. అందుకే ఉజ్వల్ పథకం ద్వార గ్యాస్ సిలిండర్లు పొందిన వారికి ఈ పథకాన్ని అమలు చేసినా 17 వందల కోట్లకుపైగానే ప్రభుత్వంపై భారం పడబోతోంది. దీపావళి నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలు మాత్రం ఇంత వరకు ఖరారు చేయలేదు. 


Also Read:టీటీడీ కొత్త చైర్మన్ ఎంపిక పెద్ద టాస్క్ - రాజకీయేతరులకే చంద్రబాబు చాన్స్ ఇవ్వబోతున్నారా?