Who is the new chairman of TTD : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులను నియమించడానికే ప్రభుత్వ పెద్దలపై ఎంతో ఒత్తిడి వస్తుంది. కేంద్ర మంత్రుల నుంచి అత్యంత పలుకుబడిగలిన వారు తమకో..తాము సూచించిన వారికో చాన్స ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు. ఇక టీటీడీ చైర్మన్ పోస్ట్ సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే పార్టీలో త్యాగం చేసిన వారికో.. మరో కీలకమైన నేతకో టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తూంటారు. ఇప్పటి వరకూ రాజకీయంగానే  ఆ పదవిని భర్తీ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం కారణంగా చైర్మన్ పోస్టును రాజకీయ నేతతో భర్తీ చేస్తే ఎన్నో విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబునాయుడు ఈ సారి రాజకీయేతర వ్యక్తులను నియమించి .. టీటీడీని సంస్కరరించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


హిందూ సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తికి చాన్స్


శ్రీవారి ఆలయ చైర్మన్ అడ్డగోలు రాజకీయాలు చేస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటన్న వారిని నియమిస్తే ఇబ్బందులు వస్తాయి. అధ్యాత్మికత ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుని .. హిందూ సమాజంలో గౌరవనీయ వ్యక్తిగా ఉన్న వారికి అవకాశం కల్పించాలనుకుంటున్నారు. శ్రీవారిపై అమితమైన భక్తి ఉన్న వారి కోసం పరిశీలన జరుపుతున్నారు. సభ్యులుగా ఎవరు ఉన్నా చైర్మన్ గా మాత్రం రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖుడ్ని పెట్టాలని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇటీవలి కాలంలో సనాతన ధర్మ పరిరక్షణ  బోర్డు గురించి ప్రస్తావిస్తున్నారు. అలాంటిది పెట్టకపోయినా అధ్యాత్మిక వేత్తల చేతుల్లో టీటీడీ ఉండాలన్న భావన ఎక్కువ మందిలో ఉంది. అందుకే సీఎం చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.  


పిత్తపరిగల వేట ఎన్నాళ్లు, తిమింగలాన్ని పట్టుకోండి- ప్యాలెస్‌ డొంక కదిలించండి- ప్రభుత్వానికి షర్మిల సూచన


ప్రచారంలోకి చాగంటి కోటేశ్వరరావు పేరు


తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మొత్తం తెలుగువారిలో చాగంటి కోటేశ్వరరావు గురించి తెలియని వారు ఉండరు. ఆయన ప్రవచనాలు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఆయనను జగన్ టీటీడీలో ధార్మిక సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత ఓ సారి జగన్ ను కూడా కలిశారు. కానీ  పదవిని చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు.  టీటీడీకి తన సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా ఇస్తానని  సలహాలు ఇవ్వడానికి పదవి అవసరం లేదన్నారు.  కాకినాడకు చెందిన చాగంటి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఫుడ్ కార్పొరేషన్‌లో  ఉద్యోగం చేసి రిటైరయ్యారు.  ఉద్యోగిగా తన విధులు నిర్వహిస్తూనే..  ప్రవచనాలు చెబుతూ అధ్యాత్మిక వేత్తగా గుర్తింపు పొందారు. ఆయన పేరు టీటీడీ చైర్మన్  రేసులో ఎక్కువగా వినిపిస్తోంది. 


విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!


మరికొన్ని ఇతర పేర్లపైనా ప్రచారం 


టీటీడీ చైర్మన్ గా చేయాలని శ్రీవారికి సేవ చేసుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూంటారు. వీరంతా తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న తప్పు జరిగినా  మహా పాపం అనుకుంటారు. అలాంటి వారు పాలనా పగ్గాలు చేపడితే పక్కాగా అన్ని  కార్యక్రమాలు జరిగిపోవడానికి ప్రాధాన్యం ఇస్తారని.. అవకతవకలకు అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అధ్యాత్మికతతో పాటు కొంత  పాలనా  సామర్థ్యం కూడా అవసరమని.. ఆ దిశగా మెరుగైన చాయిస్ ఎవరైతే వారిని నియమించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ సారి టీటీడీ చైర్మన్ పదవి పొలిటికల్ చాయిస్ కాదని గట్టి నమ్మకంతో భక్తులు ఉన్నారు.