ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన " న్యాయస్థానం టు దేవస్థానం " పాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమయింది. అమరావతి జేఏసీ నేతృత్వంలో ఈ మహాపాదయాత్ర సాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేసి .. రైతులు నడక ప్రారంబించారు.


Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?


ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షించాలని అలాగే.. అమరావతి వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తామని రైతులు ప్రకటించారు. ఈ పాదయాత్ర.. మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి ర్యాలీగా వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాలు కిక్కిరిసిపోయాయి. 


Also Read : ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ


పాదయాత్రకు వైసీపీ మినహా అన్నిరాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. తమ తమ ప్రతినిధుల్ని పంపారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ వంటి పార్టీలతో పాటు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానిక ిటీడీప ీతరపున దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నేతలు తెనాలి శ్రవణ్‌కుమార్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ మద్దతు కొనసాగుతుందని టీడీపీ నేతలు భరోసా ఇచ్చారు.  అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రను ఆదరించాలని  రాష్ట్ర ప్రజలకు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 45 రోజుల పాటు జరిగే మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలకాలని కోరారు.


Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు


రైతుల పాదయాత్రకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘిభావం తెలియచేశారు. ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమమన్నారు. 



Also Read: షెడ్యూలే రాలేదు.. అప్పుడే అభ్యర్థుల్ని టార్గెట్ చేశారు ! నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అందరిదీ దూకుడే !


టీడీపీ యువనేత లోకేష్ కూడా రైతులకు సంఘిభావం తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకి మీరు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. 





Also Read: వైసీపీ మాటలకు అర్థాలే వేరులే... వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి... విశాఖ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి