ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం రోడ్లను బాగు చేస్తుందన్న నమ్మకం కోల్పోయినట్లుగా ఉన్నారు. వాళ్లకు వాళ్లే రోడ్లను బాగు చేయించుకోవడం ప్రారంభించారు. గతంలో కుమారుడి పెళ్లికి వచ్చి వెళ్లే వారికి ఇబ్బంది అవుతుందని రూ. లక్షలు ఖర్చు పెట్టుకుని రోడ్డుకు మరమ్మతులు చేయించిన ఓ తండ్రి ఉదంతం వెలుగు చూడగా.. మరోసారి అలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. రూ.2 లక్షలు సొంత ఖర్చుతో రహదారి మరమ్మతులు చేయించాడు రంజిత్ అనే యువకుడు.




Also Read : టూరిస్టులను నట్టేట ముంచిన ట్రావెల్స్ కంపెనీ.. మధ్యలో వదిలేసి పరార్


ఏపీలో ప్రస్తుతం రోడ్లు నరకానికి నకళ్ళు గా మారాయి. ఎక్కడ చూసినా గుంతల మయం. రోడ్లపై  ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఎండ కాస్తే దుమ్ము ధూళి, చినుకు  పడితే బురదమయం.. భారీ వర్షాలు కురిస్తే ఎక్కడ ఏ పెద్ద గొయ్యి ఉందో తెలియని దుస్థితి.. దీంతో రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఒక సాహసం గా మారింది. నర్సాపురం మండలంలోని కొత్త నవరసపురానికి చెందిన చిందాడి నిరీక్షణరావు అనే వ్యక్తి తన కుమారుడు వివాహానికి వచ్చే బంధువులకు ఇబ్బంది కలగకుండా 15 కిలోమీటర్ల మేర రహదారికి రూ. రెండు లక్షలతో మరమ్మతులు చేయించారు. ఇది హాట్ టాపిక్ అయింది.


Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !


ఇప్పుడు మొగల్తూరు మండలం కేపీ పాలెం  గ్రామానికి చెందిన మరో యువకుడు రంజిత్ రూ. రెండు లక్షలు వెచ్చించి మరో రోడ్డుకు మరమ్మతులు చేయించారు. చిరు వ్యాపార సంస్థ నడిపే సుంకర రామారావు కుమారుడు అయిన రంజిత్ రొయ్యల బిజినెస్‌లో ఉన్నారు. తన ఊరు నుంచి వెళ్లే ఆర్ అండ్ బి రహదారి గుంతలు పడి ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.  పర్యాటకులు నిరంతరం రాకపోకలు సాగించే పేరుపాలెం బీచ్ కు వచ్చే ఈ రోడ్డు దారుణంగా మారడంతో పలు ఇబ్బందులు పడడాన్ని గమనించి సొంత సొమ్ము రూ. రెండు లక్షలు వెచ్చించి రహదారికి కొంతమేర గుంతలు పూడిపించారు.


Also Read: Hyderabad Crime: 40 ఏళ్లయినా పెళ్లికాలేదని తొందరపడితే కోటి పోయింది..


ఈ రోడ్డు మార్గంలో బురద, గుంతలు తప్ప రోడ్డు అసలు కనపడని దుస్థితి లో ఉండగా  కేపీపాలెం హై స్కూల్ నుంచి తూర్పు తాళ్ళు గ్రామం  వెళ్లే రహదారి పొడవున ఇదే పరిస్థితి మారింది. ఈ మార్గం మీదుగా బైకులు, కార్లతో పాటు భారీ వాహనాలను నిత్యం ప్రయాణిస్తుంటాయి. రోడ్డు అంతా గుంతలు తేలటంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి తలెత్తింది. ఇటీవల పలు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో రంజిత్ రహదారి కి మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు.  అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేదు. కానీ రంజిత్ మాత్రం ప్రభుత్వానికి మించి ఆలోచించి ప్రజలకు మేలు చేశారు. 


Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి