Today Top Headlines In AP And Telangana:
1. నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ
గత కొన్ని రోజులుగా తాడిపత్రిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బిజెపి నేతలు అన్నట్లుగా పేలుతున్న మాటల తూటాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ పార్టీల నేతల బహిరంగంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజా వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సినీ నటి మాధవిలతపై ఏదో ఆవేశంలో మాట్లాడాను. ఇంకా చదవండి.
2. మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఓ విద్యార్థిని అడిగిన సమస్యపై స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గంటల వ్యవధిలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన డైనమిక్ పనితీరు ఎలా ఉంటుందో కొన్ని గంటల వ్యవధిలో చూపించారు. విజయవాడ పాయికాపురంలో శనివారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (Mid Day Meals) ప్రారంభించారు. అయితే రమ్య అనే ఇంటర్ బైపీసీ విద్యార్థిని తమ సమస్యను మంత్రి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గంటల వ్యవధిలోనే మంత్రి నారా లోకేష్ వారి సమస్యకు పరిష్కారం చూపించారు. ఇంకా చదవండి.
3. ఏపీలో త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ
ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న అద్భుత దృశ్య కావ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తామని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఫిల్మ్ పాలసీని తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. రాజమహేంద్రవరంలోని వేమగిరిలో శనివారం జరిగిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనే విషయంపై మాట్లాడారు. ఇంకా చదవండి.
4. అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు
ఐకాన్ స్టార్, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు షాకిచ్చారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి రాం గోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని ప్రచారం జరిగింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు రావొద్దని సూచిస్తూ పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. కిమ్స్‌కు వెళ్లి బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించకూడదని పోలీసులు అల్లు అర్జున్‌కు సూచించారు. ఒకవేళ ఆయన హాస్పిటల్‌కు వెళ్లాలని భావిస్తే మాత్రం తమ సూచనలు తప్పక పాటించాలన్నారు. ఇంకా చదవండి.
5. సివిల్స్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, దేశంలోనే ఇది రికార్డు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా భవన్‌లో ఆదివారం నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.1 లక్ష రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఇంకా చదవండి.