Top Headlines In AP And Telangana:


1. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు షాక్


వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేసిన సజ్జల భార్గవ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టించారన్న కేసులు కొట్టేయాలని ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏమైనా ఉంటే హైకోర్టులో చెప్పుకోవాలని పేర్కొంది. అయితే రెండు వారాల వరకు అరెస్టు చేయొద్దని మాత్రం ఊరట కల్పించింది. ఇంకా చదవండి.


2. ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు మహర్దశ


అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం మరింతంగా అభివృద్ధి చెంది ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకోనుంది. ఏటా వచ్చే లక్షల మంది భక్తుల సౌకర్యార్థం మరిన్ని వసతులు సమకూరే ఆవకాశం ఉంది. స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను కేంద్రానికి సమర్పించారు. దానికి అనుమతి లభిస్తే మాత్రం సూర్యనారాయణ దేవాలయం మరింత శోభాయమానంగా మారిపోనుంది. అరసవల్లి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఈ మధ్యే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. ఇంకా చదవండి.


3. తెలంగాణలో ఎస్సై ఆత్మహత్య


ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాజేడు మండలం ముళ్ళ కట్ట వద్ద ఉన్న హరిత రిసార్ట్‌లోని గదిలో హరీష్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. హరీష్ నిన్న హరిత హోటల్లో రూం తీసుకున్నాడు. హరీష్ స్వగ్రామం భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వర్ల పల్లి. వ్యక్తిగత కారణాల లేక విధి నిర్వహణ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడ అనే కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని  విచారణ చేపట్టారు. ఇంకా చదవండి.


4. కానిస్టేబుల్ అక్కను పొడిచి చంపేసిన తమ్ముడు


కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో అక్కను హత్య చేశాడో తమ్ముడు. హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌లో జరిగిన దుర్ఘటన సంచలనంగా మారింది. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అక్కను తమ్ముడు కిరాతకంగా హత్య చేశాడు.డ్యూటీకి వెళ్తున్న అక్కను వెంబడించి కారుతో ఢీ కొట్టి కత్తితో పొడి నడిరోడ్డుపై హత్య చేశాడు. ఇబ్రహింపట్నం రాయపోల్‌లో ఉంటున్న నాగమణి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆమె వేరే కులం వ్యక్తిని ప్రేమించింది. వివాహం చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. దీనికి కుటుంబ పెద్దలు వద్దని చెప్పారు. ఇది నచ్చని తమ్ముడు పరమేష్‌ కూడా ఈ పెళ్లి అడ్డు చెప్పాడు. ఇంకా చదవండి.


5. రిలయన్స్ జియో అద్భుత ఆఫర్


దేశంలో టాప్‌ ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నుంచి అనేక ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా వివిధ కాల పరిమితులతో (Validity) ట్రూ 5G అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌, ట్రూ అన్‌లిమిటెడ్‌ అప్‌గ్రేడ్‌, డేటా బూస్టర్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్స్‌, యాన్యువల్‌ ప్లాన్స్‌, డేటా ప్యాక్స్‌, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, ఐఎస్‌డీ, టాప్‌-అప్‌, వాల్యూ ప్లాన్స్‌ను జియో అందిస్తోంది. వీటితోపాటు వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వాన్ని పొందే సూపర్‌ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఇంకా చదవండి.