Srikakulam Latest News Today: అరసవల్లిసహా శ్రీకాకుళం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు మహర్ధశ- కేంద్రం వద్ద వంద కోట్ల రూపాయల అభివృద్ధి మాస్టర్ ప్లాన్

Arasavalli Temple Development News: సూర్యనారాయణ దేవాలయం అభివృద్ధి పనులకు ప్లాన్స్‌ సిద్ధమైంది. అరసవల్లి దేవాలయంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న టెంపుల్, పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయనున్నారు.

Continues below advertisement

Srikakulam Arasavalli Suryanarayana Temple Development News: అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం మరింతంగా అభివృద్ధి చెంది ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకోనుంది. ఏటా వచ్చే లక్షల మంది భక్తుల సౌకర్యార్థం మరిన్ని వసతులు సమకూరే ఆవకాశం ఉంది. స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను కేంద్రానికి సమర్పించారు. దానికి అనుమతి లభిస్తే మాత్రం సూర్యనారాయణ దేవాలయం మరింత శోభాయమానంగా మారిపోనుంది.   

Continues below advertisement

అరసవల్లి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఈ మధ్యే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. సూర్య దేవాలయం మాస్టర్ ప్లాన్ అమలుతో సమగ్రం అభివృద్ధికి సహాయం చేయాలని రామ్‌ తెలిపారు. ఏటా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారని వివరించారు. రథసప్తమి ఒక్కరోజునే లక్షలాది మందివరకు భక్తులు వస్తున్నారని షేకావత్‌కు వివరించారు. 

శ్రీకాకుళం జిల్లాలో పర్యాటకంగా ఆకట్టుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయని వీటితోపాటు సూర్య నారాయణ దేవాలయాన్ని విదేశీయులు సైతం సందర్శిస్తుంటారని కేంద్రమంత్రికి తెలియజేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వ పథకం తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక విస్తరణ పథకం (ప్రసాద్)లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొంచాలనివిన్నవించారు. 

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రామ్మోహన్‌తోపాటు టీడీపీ ఎంపీలు ఎం. శ్రీభరత్ (విశాఖపట్నం), హరీష్ బాలయోగి (అమలాపురం), నాగరాజు (కర్నూలు), దగ్గుమాల ప్రసాదరావు (చిత్తూరు) కలిశారు దేశంలోనే అతి పురాతన, ఏకైక సూర్య దేవాలయం అరసవల్లి ఆలయ చరిత్ర, విశిష్టత, వాస్తు నైపుణ్యం, అభివృద్ధి ఆవశ్యకతను పర్యాటక మంత్రికి వివరించారు. చారిత్రకంగా 7వ శతాబ్దంలో నిర్మితమైన సూర్యదేవాలయంలో ఉత్తరాయణం, దక్షిణాయన కాలాల్లో సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్ పాదాలను తాకుతాయని తెలిపారు. దేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడ చూడలేమన్నారు. 

ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నా లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల అవసరాలకు తగినట్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీనిని గుర్తించి, రూ.100 కోట్లతో సూర్య దేవాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూపొందిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ప్రతిపాదనలను ఆయనకు అందజేశారు. ప్రసాద్ పథకంలో ఎంపిక చేయడం ద్వారా అటు పర్యాటక అభివృద్ధితో పాటుజిల్లా అభివృద్ధి, స్థానికులకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి కేటాయింపులపై కృతజ్ఞతలు..

మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.113.75 కోట్లు కేటాయించడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో పర్యాటక అభివృద్ధికి రూ.2 వేల కోట్లు, పెన్నా నదిపై రూ.78 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు, గోదావరి నదీ తీరం సమగ్ర అభివృద్ధిని సూచించే అఖండ గోదావరి ప్రాజెక్టు (హేవ్లాక్ వంతెన, పుష్కర ఘాట్) కోసం రూ.94 కోట్లు మంజూరు చేసి గజేంద్రసింగ్ షెకావత్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు నడిపించడంతోపాటు ప్రజాసంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి దాని అభివృద్ధి చేస్తే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్‌గా అవుతుంది. బారువ సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా కొన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గాని ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సౌకర్యాలు ఉండేలా బస ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రముఖ దేవాలయాలు శ్రీముఖలింగం. శ్రీకూర్మం. అరసవల్లి దేవాలయాలు అభివృద్ధి చేస్తే శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా అనే అపవాదు పోతుందని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా వలసలు నివారణ కూడా కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. రహదారులు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఒక సమీక్ష కూడా నిర్వహించుకున్నారు. రహదారులు పూర్తిస్థాయిలో అయితే శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలోని కీలక పాత్ర పోషించిన ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తమ్ముళ్లూ కష్టం ఏదమైనా షేర్ చేసుకోండి- తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు- టీడీపీ కార్యకర్త మృతిపై లోకేష్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Continues below advertisement