Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు

Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతిపై అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న ఆమె అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం బాధాకరం.

Continues below advertisement

Kannada TV Actor Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తాజాగా సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. కర్ణాటకకు చెందిన శోభిత శివన్నకు ప్రస్తుతం 32 ఏళ్ళు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ నటి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటుంది. అయితే ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. 

Continues below advertisement

శోభిత కర్ణాటకలోని హసన జిల్లా, సకలేశుపురకు చెందిన అమ్మాయి. తెలుగులో ఆమె 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ ఆడకపోవడంతో శోభితకు పెద్దగా గుర్తింపు రాలేదు. కన్నడతో పాటు తెలుగులో కూడా ఆమె పలు సీరియల్స్ లో సినిమాలో నటించింది. ఆ లిస్టులో ఎరదొండ్ల మూరు, ఏటీఎం, జాక్పాట్, వందన, అపార్ట్మెంట్ టు మర్డర్ అనే సినిమాలతో పాటు బ్రహ్మగంటె, నిన్నిందలే వంటి సీరియల్స్ లో కూడా నటించింది. అయితే రెండేళ్ల క్రితం శోభిత పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత హైదరాబాద్ లోనే స్థిరపడింది. 

గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో భర్త సుధీర్ రెడ్డితో కలిసి నివాసం ఉంటుంది శోభిత. ఆమె భర్త సాఫ్ట్​వేర్ ఇంజనీర్​గా పని చేస్తున్నాడు. అయితే తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన శోభితకు బెంగళూరులో సాఫ్ట్​వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సుధీర్ రెడ్డితో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుంది. సుధీర్ హైదరాబాద్ తుక్కుగూడకు చెందినవాడు. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కి ఈ జంట మకాం మార్చారు. కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ, సి బ్లాక్ లో ఓ ఇంట్లో ఈ జంట అద్దెకు ఉంటున్నారు. అయితే పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంటోంది. 

ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె ఓ గదిలో నిద్రపోయింది. మరో గదిలో భర్త సుధీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావడం వల్ల వర్క్ చేసుకుని, పడుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పని మనిషి రావడం, శోభిత పడుకున్న రూమ్ తలుపు కొట్టినా రెస్పాన్స్ లేకపోవడంతో సుధీర్ రెడ్డికి విషయం తెలిసింది. దీంతో అతను వచ్చి తలుపులు విరగ్గొట్టగా, శోభిత ఫ్యాన్ కి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. అయితే ఇప్పటిదాకా ఇంకా ఆమె మరణానికి గల కారణాలు తెలియ రాలేదని అంటున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లాంటిది కూడా దొరకకపోవడంతో ప్రస్తుతం పోలీసులు ఆమె అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టారు. ఇక హైదరాబాద్లో పోస్టుమార్టం అయ్యాక, ఆమె భౌతికకాయాన్ని బెంగళూరుకు తరలించే ఛాన్స్ ఉంది. శోభిత మృతి పట్ల ఆమెతో కలిసి పని చేసిన టీవీ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Read Also : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?

Continues below advertisement