ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న పీఆర్సీ అంశంపై ప్రకటన చేసింది. ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద 27 శాతం ఇస్తున్నారు. దాని కన్నా రెండు, మూడు శాతం ఎక్కువగా అయినా ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నా.. చివరికి మూడున్నర శాతం వరకూ తగ్గించి ఖరారు చేశారు. దీంతో ఉద్యోగుల జీతం తగ్గనుంది. అయితే ఉద్యోగుల జీతాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో  ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?


ప్రస్తుతం 60 ఏళ్లకు రిటైర్ అవుతారు. 2014 ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 57 ఏళ్లు మాత్రమే ఉండేది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ వయసు పరిమితిని అరవైకి పెంచారు. అప్పట్లో ఉద్యోగసంఘాలు వయసు పెంపును డిమాండ్ చేశాయి. బాధ్యతలు పూర్తిగా తీరక ముందే రిటైరవుతున్నామని .. వయసు పెంచాలని కోరాయి. అయితే ఈ సారి ఉద్యోగ సంఘాలు వయసు పరిమితి పెంపు కోసం ఎలాంటి డిమాండ్ చేయలేదు. అయితే ప్రభుత్వం మాత్రం అనూహ్యంగా రిటైర్మెంట్ వయసును 62కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  


Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


ఈ నిర్ణయం వల్ల వచ్చే రెండేళ్ల పాటు రిటైరయ్యే ఉద్యోగులు ఉండరు. ఈ కారణంగా వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ గురించిన చింత ఉండదు. ఇప్పటికే పెద్ద ఎత్తున రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు ఎవరూ రిటైర్ కారు కాబట్టి ఈ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రకటించి పీఆర్సీ జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.


Also Read: అడ్డంగా బుక్కైన బంగార్రాజు.. టికెట్‌ రేట్‌ ఇష్యూలో నాగార్జునపై ట్రోల్స్‌


కొత్త పీఆర్సీ వల్ల ప్రభఉత్వంపై అదనంగా రూ. పది వేల కోట్లకుపైగా భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లను రెండు వారాల్లో పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా కారణంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ నెలాఖరు కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. 


Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి