బంగార్రాజు సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో నాగార్జున చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రాజకీయాలపై మాట్లాడబోనన్న నాగార్జున.. తన సినిమాకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పడం దుమారానికి కారణమైంది.
నాగార్జున వ్యాఖ్యలపై ఎగ్జిబిటర్స్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల బంగార్రాజు సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆ ప్లేస్‌లో అఖండ, పుష్ప సినిమాలు కంటిన్యూ చేయాలని నిర్ణయానికి వచ్చారట.
సినిమా వేదికలపై అసెంబ్లీ అభ్యర్థుల టికెట్ల వ్యవహారమో.. పార్లమెంట్ అభ్యర్థుల టికెట్ల వ్యవహారం లాంటి అంశాలు మాట్లాడితే రాజకీయం అవుతుంది కానీ... సినిమా వేదికపై సినిమా టికెట్ల ఇష్యూ మాట్లాడటం రాజకీయం ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు కొందరు.
ఓ వైపు అంతా కలిసి కట్టుగా టికెట్ రేట్లపై పోరాడాలని ఆర్జీవీ ఈ మధ్య పిలుపునిచ్చారు. మొన్న చిరంజీవి కూడా నేను సినిమా పెద్దగా ఉండాలనుకోవడం లేదన్నారు. పంచాయితీలు తీర్చడం నా వల్ల కాదంటూ తప్పుకున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా ఇదే బాటలో నా సినిమాకు ఇబ్బంది లేదు అంటూ టికెట్ ఇష్యూను లైట్ తీసుకున్నారు. దీంతో పిల్లి మెడలో గంట కట్టేది ఎవరనే డిస్కషన్ నడుస్తోంది.
నాగార్జున గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్నాయని కామెంట్స్ చేసిన నాగార్జున ఇప్పుడు నడుస్తున్న ఇష్యూతో సంబంధం లేదని చెప్పడంపై ఆశ్చర్యపోతున్నారు. రగడ టైంలో ఈ కామెంట్స్ చేశారు. అప్పట్లో రోశయ్య సీఎంగా ఉన్నారు.
రాజశేఖర్‌రెడ్డితో నాగార్జునకు మంచి సంబంధాలే ఉండేవి. ఆయన చనిపోయిన తర్వాత జగన్‌తో కూడా అదే సఖ్యతగా ఉన్నారు నాగార్జున. తరచూ ఆయనతో సమావేశమవుతుంటారు. ఈ మధ్య కాలంలోనే లంచ్‌మీట్‌లో ఇరువురు పాల్గొన్నారు.
వాటిన్నింటినీ గుర్తు చేస్తూ నాగార్జున కామెంట్స్‌పై ఓ వర్గం మండిపడుతోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు గుర్తు చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాను ఆపినా ఫర్వాలేదని.. ఇండస్ట్రీని మాత్రం ఇబ్బంది పెట్టొద్దని పవన్ కల్యాణ్ అన్న వ్యాఖ్యలు ఉటంకిస్తూ నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఏమైనా ఫర్వాలేదు.. తన సినిమాకు నష్టం లేదని నాగార్జున చెప్పడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.
ప్రభుత్నాన్ని సపోర్ట్ చేసేవాళ్లంతా నాగార్జును వెనకేసుకొస్తున్నారు. ఆయన చేసింది వంద శాతం కరెక్టని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మంచి ఆలోచనతో నాగార్జు ఈ వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ పెడుతున్నారు. నిన్నటి వరకు ఆర్జీవీ కామెంట్స్‌తో రచ్చరచ్చ అయితే ఇప్పుడు నాగార్జునపై కామెంట్స్ హాట్‌గా మారాయి.
Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..
Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు